»   »  అప్పుడు మాటలనవసం అంటున్న సెక్స్ బాంబ్!

అప్పుడు మాటలనవసం అంటున్న సెక్స్ బాంబ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Mallika Sherawat
బాలీవుడ్ సెక్స్ బాంబ్ మల్లికా షెరావత్ ఇప్పుడు నొ డైలాగ్స్...ఓన్లీ ఏక్షన్ అనే నిర్ణయానికొచ్చింది. ఆమె తాజాగా స్నేక్ ఉమెన్ గా చేస్తున్న హిస్ చిత్రంలో ఆమెకు డైలాగులు అసలు లేవు. ఈ సినిమాలో ఆమె పగ తీర్చుకునే నాగిని గా చేస్తోంది...అయినా పాములు రెగ్యులర్ గా మాట్లాడవు కదా...అనే ఈ రకంగా ఏర్పాటు చేసానంటోంది ఆ చిత్ర దర్శకురాలు జెన్నిఫర్ లిచ్. అయితే మల్లికా లాంటి సెక్స్ బాంబ్ లకు మాటలతో పనేముంటుంది.చూపులు ...చేష్టలు చాలు కదా అంటున్నారు ఆమెతో గతంలో డేటింగ్ చేసినవాళ్ళు.

అయితే మల్లిక మాత్రం ఇది ఒక వెరైటీ పాత్ర అని ఒప్పుకున్నాను. మాటలు లేవంటే మరీ మంచిది...నా నటనా వైదుష్యం చూపించవచ్చు అని ముచ్చటపడుతున్నాను అంది. ఇక ఈ సినిమాలో అన్నీ ఫేస్ ఎక్స్ ప్రెషన్సే నంటోంది. అందులోనూ పాములాగే ఆమె బుస కొడుతుందిట. ఇక ఆమె పాము పాత్ర కోసం సూట్ వేసుకున్నాక నడవటానికి కూడా ఇబ్బందేనట. దాంతో యూనిట్ సభ్యులే ఆమెను షూటింగ్ స్పాట్ దగ్గరకు మోసుకెళ్తున్నారుట .ఇదంతా చూస్తుంటే మల్లిక మంచి హిట్టే కొట్టేటట్లు ఉంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X