twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రారా, పోరా అనుకున్నాం,నాకు ఆత్మాభిమానం ఉంది : ఇళయరాజాపై ఎస్పీబాలూ స్పందన ఇలా

    తాను స్వరపరిచిన పాటలను బాలూ ఇక మీదట తన అనుమతి లేకుండా పాడకూదదంటూ సంగీత దర్శకుడు ఇళయ రాజా నోటీసులు పంపిన విషయం మీద బాలూ మరో సారి స్పందించారు.

    |

    తాను స్వరపరిచిన పాటలను బాలూ ఇక మీదట తన అనుమతి లేకుండా పాడకూదదంటూ సంగీత దర్శకుడు ఇళయ రాజా నోటీసులు పంపిన సంగతి సినీ ప్రపంచం లో ఒక దుమారమే రేపింది.. ఈ విశయం మీద బాలూ మరో సారి స్పందించారు. సంగీత దర్శకుడు ఇళయరాజాతో తనకెలాంటి బేధాభిప్రాయాలు లేవని ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు.

    వీరిద్దరి మధ్య ప్రేమ,అభిమానం

    వీరిద్దరి మధ్య ప్రేమ,అభిమానం

    ఇళయరాజా సంగీతం ,ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాట గురించి పరిచయం అవసరం లేదు. అలాగే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే పాటలు అంటే అభిమానులకు.సంగీత ప్రియులకు ఎంతో ఇష్టం. అంతేకాకుండా వీరిద్దరి మధ్య ప్రేమ,అభిమానం అనేక సంధర్బాలలో వేదికపై ప్రపంచానికి తెలియజేసారు.

    సంచలనం రేకెత్తించింది

    సంచలనం రేకెత్తించింది

    కాగా తాను స్వరపరిచిన గీతాలను ఆలపించడం సరికాదంటూ బాలుకు ఇళయరాజా నోటీసులు పంపడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ విషయం సినీ వర్గాల్లో సంచలనం రేకెత్తించింది.కొత్తతరం గాయకులు రావడంతో కొంతకాలంగా ప్లే‌బ్యాక్ సింగింగ్‌కు దూరంగా ఉన్న ఎస్పీబీ దేశ విదేశాల్లో షోలు నిర్వహిస్తున్నారు.

    లీగల్ నోటీసులు

    లీగల్ నోటీసులు

    తాజాగా అమెరికాలోని సీటల్, లాస్ ఏంజిల్స్ నగరాల్లో ప్రదర్శనలు నిర్వహించారు. ఎస్పీ బాలసుబ్రమణ్యంకి మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా లీగల్ నోటీసులు పంపారన్న వార్త ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. అసలు ఇలాంటి నోటీసులు ఇవ్వవచ్చని కూడా చాలామందికి ఈ ఉదంతం వల్లే తెల్సింది కూడా

    ఇళయరాజా వర్సెస్ బాలు

    ఇళయరాజా వర్సెస్ బాలు

    ఇళయరాజా వర్సెస్ బాలు ఎపిసోడ్లో రెండు వర్గాలుగా చీలిపోయారు. కొందరు ఇళయరాజాను సమర్దిస్తే.. మరికొందరు బాలును సమర్దిస్తూ మాట్లాడారు. దీంతో ఈ ఇష్యూ మీద తీవ్ర చర్చ నడుస్తోంది. ఇళయరాజా నోటీసులపై తనదైన శైలిలో స్పందించిన బాలు.. అంతలోనే రియాక్ట్ అయి.. ఈ ఇష్యూను మరో స్టేజ్ కి తీసుకెళ్లారు.

    అందరూ శ్రమిస్తేనే

    అందరూ శ్రమిస్తేనే

    ఓ పాట వెనుకచాలామంది కష్టం ఉంటుందని.. దర్శకుడు.. నిర్మాత.. సంగీత దర్శకుడు.. సింగర్.. వాయిద్యకారులు ఇలా చాలామందేఉంటారని.. అలాంటప్పుడు హక్కులు మొత్తం సంగీతదర్వకుడికి ఇవ్వాలనటం సరికాదని.. అందరూ కలిసికట్టుగా శ్రమిస్తేనే సినిమా బయటకు వస్తుందని.. సినిమాలో ఒక సన్నివేశమైనా.. పాట అయినా.. దాని వెనుక సమిష్ఠి కష్టం ఉంటుందన్న విషయాన్ని మర్చిపోకూడదని.. తాను చెప్పాల్సిన మాటను చెప్పేశారు.

     గాయకుడిగా 50 వసంతాలు

    గాయకుడిగా 50 వసంతాలు

    గాయకుడిగా 50 వసంతాలను పూర్తి చేసుకున్న ఆయన తన గోల్డెన్‌ జూబ్లీని పురస్కరించుకుని తన సంగీత కళాకారుల బృందంతో కలిసి విదేశాల్లో సంగీత విభావరి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే సంగీత కచేరిల్లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తన పాటలను పాడకూడదని ఇళయరాజా అనూహ్యంగా నిషేధం విధించడం, అందుకు నోటీసులు పంపడం వివాదంగా మారడం, సినీ వర్గాల్లో పెను సంచలనంగా మారడం తెలిసిందే.

    ఎలాంటి బేధాభిప్రాయాలు లేవని

    ఎలాంటి బేధాభిప్రాయాలు లేవని

    అయితే ఎస్‌పీబీ కూడా ఇకపై ఇళయరాజా పాటలను తాను పాడనని వెల్లడించారు కూడా. ఇలాంటి పరిస్థితుల్లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఒక చానల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ తనకు ఇళయరాజాకు మధ్య ఎలాంటి బేధాభిప్రాయాలు లేవని పేర్కొన్నారు. అయితే ఆయన చర్యలు తనను చాలానే బాధించాయన్నారు.

    నాకూ ఆత్మాభిమానం ఉంది

    నాకూ ఆత్మాభిమానం ఉంది

    అయినా తన సంగీత కచేరిలకు ఎలాంటి బాధింపు కలగలేదని పేర్కొన్నారు.,అదే విధంగా రారా.. పోరా.. అని మాట్లాడుకునేంత స్నేహమే తమదని, అలాంటిది ప్రస్తుత సమస్యను కాలమే తీర్చాలని పేర్కొన్నారు. ఈ విషయమై ఇళయరాజాతో ఫోన్‌లో మాట్లాడమని కొందరు హితవు పలికారన్నారు. అయితే తనకూ కొంచెం ఆత్మాభిమానం ఉందని బాలసుబ్రహ్మణ్యం వ్యాఖ్యానించారు.

    English summary
    Playback singer SP Balasubrahmanian, who is currently on a world tour, termed the legal notice sent by Illayaraja as “unfortunate”, He added that he would follow the law and that the concert would continue as he would sing songs by other composers.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X