twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ బయోపిక్: తారక్‌ను అందుకే తీసుకోలేదు, బాబాయ్‌తో విభేదాలపై.. కళ్యాణ్ రామ్ క్లారిటీ!

    |

    Recommended Video

    NTR Biopic : Jr NTR Is Not Having A Suitable Role In Movie : Kalyan Ram | Filmibeat Telugu

    బాలకృష్ణ, జూ ఎన్టీఆర్ మధ్య సరైన సంబంధాలు లేవని, వీరి మధ్య రిలేషన్ దెబ్బతిందని గతంలో రూమర్స్ వినిపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పుకార్లను ఇటు బాలయ్యకానీ, అటు జూ ఎన్టీఆర్ కానీ పెద్దగా పట్టించుకోలేదు. ఎన్టీఆర్ బయోపిక్‌లో సైతం తారక్ లేక పోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.

    'ఎన్టీఆర్ బయోపిక్'లో తన తండ్రి హరికృష్ణ పాత్రను పోషించిన కళ్యాణ్ రామ్... సినిమా ప్రమోషన్లో భాగంగా నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో బాలయ్య-జూ ఎన్టీఆర్ మధ్య విబేధాలు అంటూ వచ్చిన పుకార్లపై క్లారిటీ ఇచ్చారు.

    బాలయ్య-జూ ఎన్టీఆర్ మధ్య విబేధాలు ఉన్నాయా?

    బాలయ్య-జూ ఎన్టీఆర్ మధ్య విబేధాలు ఉన్నాయా?

    బాలకృష్ణ, జూ ఎన్టీఆర్ మధ్య సరైన సంబంధాలు లేవని వార్తలు వచ్చాయి.. ఇది నిజమేనా? అనే ప్రశ్నకు కళ్యాణ్ రామ్ స్పందిస్తూ ‘ఆ వార్తలు నేనూ విన్నాను. అందులో ఎలాంటి నిజం లేదు. ఇలాంటి పుకార్లు ఎలా వస్తాయో కూడా అర్థం కాదు. బయోపిక్ ఆడియో లాంచ్ ఈవెంటులో బాబాయ్ పిలిస్తే తమ్ముడు వచ్చాడు. బాబాయ్‌కి ప్రేమ ఉంది కాబట్టే పిలిచాడు. విబేధాలు లేవనడానికి ఈ సంఘటన చాలు' అన్నారు కళ్యాణ్ రామ్.

    బయోపిక్‌లో తారక్‌ను అందుకే తీసుకోలేదు

    బయోపిక్‌లో తారక్‌ను అందుకే తీసుకోలేదు

    తారక్ ఇపుడు సూపర్ స్టార్. బయోపిక్‌లో చిన్న పాత్ర ఇస్తే అతడి స్టార్ డమ్‌కు న్యాయం జరుగదు. అభిమానులు కూడా డిసప్పాయింట్ అవుతారు. ఇందులో తమ్ముడికి తగిన పాత్ర లేదు కాబట్టే లేడు... అంతకు మించి ఏమీ లేదని కళ్యాణ్ రామ్ స్పష్టం చేశారు.

    చైతన్య రథ సారథి

    చైతన్య రథ సారథి

    కాగా...ఎన్టీఆర్ బయోపిక్‌‌లో కళ్యాణ్ రామ్ తన తండ్రి హరికృష్ణ పాత్రలో చైతన్య రథసారధిగా కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో అతడి పాత్ర నిడివి కూడా ఎక్కువగా ఉండనుంది. కళ్యాణ్ రామ్ పోషించిన రోల్ ఎక్కువగా రెండో భాగంలో కనిపిస్తుందని తెలుస్తోంది.

    ఎన్టీఆర్ బయోపిక్

    ఎన్టీఆర్ బయోపిక్

    మహా నటుడు, మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రెండు భాగాలుగా ఈ బయోపిక్ రూపొందుతుండగా మొదటి భాగం 'ఎన్టీఆర్-కథానాయకుడు' జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జాగర్లమూడి క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ బయోపిక్‌ రెండో భాగం 'ఎన్‌.టి.ఆర్‌ మహానాయకుడు' ఫిబ్రవరి 7న విడుదల కాబోతోంది. ఎన్‌బికె ఫిల్మ్స్ నిర్మాణంలో వారాహి చలన చిత్రం సమర్పణలో ఈ బయోపిక్ విడుదల కాబోతోంది. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు.

    English summary
    Jr NTR’s brother Kalyan Ram has clarified that there are indeed no differences between his Babai Balakrishna and his brother Jr NTR.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X