నో డైరెక్షన్ నో యాక్షన్: అమితాబ్ బచ్చన్
దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న నటుడు అమితాబ్ బచ్చన్. బిగ్ బి అనగానే ప్రేక్షకుడిలో ఏదో కూతూహలం కలుగుతుంది. మరి దర్వకత్వం ఎప్పుడని అడిగితే ఇలా సమాధనమిస్తున్నారు..'నటనకు సంబంధించి సిద్ధమవడం, ప్రదర్శించడం, దాన్నుంచి బయటపడటం'ఇవే నాకు తెలిసినవి. సినిమా అనే అంశంలో నేను చేయగలిగింది చాలా తక్కువ.
అలాంటప్పుడు దర్శకుడనే పెద్ద బాధ్యతలను ఎలా నిర్వర్తించగలను!' అని బిగ్ బి తన బ్లాగ్‌లో రాసుకున్నారు. దర్వకత్వం గురించి ఇంకా ఏమంటున్నారంటే..'నాకు సంబంధించి దర్శకత్వం అంటే అనేక శాఖలను సరిగ్గా సమన్వయం చేయగలగాలి. అలాంటప్పుడు అనేక విషయాలపై అవగాహన ఉండాలి. ఇంకా బాగా చెప్పాలంటే..కథను ఆసక్తిదాయకంగా చెప్పగలిగే శక్తి ఉండాలి. ఆసిక్తిదాయకంగా చెప్పడం మేమూ చేస్తాం. కానీ తెరకెక్కించడమే వేరుగా ఉంటుంది' అని తెలిపారు.
అయితే బాలీవుడ్ దిగ్గజంగా, బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో బిగ్ బిగా పేరు సంపాదించుకొన్న అమితాబ్ దర్శకత్వ జోలికెళ్ళకుండా త్వరలోనే సినీ పరిశ్రమ నుండి రిటైర్ అవ్వనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నో విజయాలను సాధించి, తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న బిగ్ బి ఇటీవలే దుబాయ్ ఇంటర్నేషనల్ ఫిల్మిం ఫెస్టివల్ నుండి లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డును కూడా అందుకున్నారు. అమితాబ్ నటనకి స్వస్తి చెప్పడానికే దాదాపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అమితాబ్ తన రిటైర్డ్ గురించి త్వరలోనే అధికారకంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











