twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిర్మాతలతో చర్చలు విఫలం: సినీ సమ్మె యధాతథం

    By Srikanya
    |

    హైదరాబాద్ : తెలుగు చలనచిత్ర పరిశ్రమ కార్మిక సమాఖ్య, ఏపీ చలనచిత్ర నిర్మాతల మండలి మధ్య చర్చలు విఫలమయ్యాయి. ఈ నెల 9న తిరిగి చర్చలు జరపాలని నిర్ణయించారు. కార్మిక శాఖ సంయుక్త కమిషనర్‌ డాక్టర్‌ గంగాధర్‌ సమక్షంలో మంగళవారమిక్కడ రాత్రి పొద్దుపోయేదాక జరిగిన చర్చలకు నిర్మాతల మండలి అధ్యక్షుడు ఎన్‌వీ ప్రసాద్‌, రవికిషోర్‌, తేజ, పరుచూరి ప్రసాద్‌, కొడాలి వెంకటేశం హాజరయ్యారు.

    కార్మిక సమాఖ్య అధ్యక్షుడు వెంకటేశ్‌, ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్‌రెడ్డి, టీఎస్‌ఎన్‌ దొరై, కాదంబరి కిరణ్‌లు పాల్గొన్నారు. చిన్నాపెద్ద సినిమా అనే తేడా లేకుండా సమానపనికి సమానవేతనం ఇవ్వాలని కార్మికులు కోరారు. వేతన సవరణ ఒప్పందం గడువు ముగిసి పదకొండు నెలలు కావస్తున్నప్పటికీ వేతనాలు పెంచటం లేదని పేర్కొన్నారు. విధులు నిర్వర్తిస్తూనే చర్చలు సాగించాలన్న నిర్మాతల ప్రతిపాదనకు కార్మిక సమాఖ్య నేతలు విముఖత చూపారు.

    ఈ సమ్మె ప్రభావం పవన్ గోపాల గోపాల, ఎన్టీఆర్ టెంపర్, శంకర్, విక్రమ్ ల ఐ చిత్రాలపైనే ఎక్కువ పడనుంది. సంక్రాంతి విడుదల తేదీలు పెట్టుకున్న వీరంతా చాలా టెన్షన్ గా ఈ సమ్మె ఎప్పుడు ముగుస్తుందా అని ఎదురుచూస్తున్నారు.

    No end in sight for Tollywood strike

    సమ్మె వివరాల్లోకి వెళితే...

    మొన్నీ మధ్యనే సమ్మెనుంచి బయిటపడి షూటింగ్ లు జరుపుకుంటున్న తెలుగు సినిమా మరోసారి ఆగిపోనుంది. తెలుగు సినిమా షూటింగులు మొన్న గురువారం నుంచి ఆగిపోనున్నాయి. డిమాండ్ల సాధన కోసం గురువారం నుంచి సినీ కార్మికులు నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు.. ఫిల్మ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ అధ్యక్ష కార్యదర్శులు కొమర వెంకటేశ్‌, ఎస్‌. రాజేశ్వర్‌రెడ్డి ప్రకటించారు. కాగా, ఇటీవలే సమ్మె నిర్వహించిన కార్మికులు, వేతనాల పెంపునకు ఫిల్మ్‌చాంబర్‌ అంగీకరించడంతో విధులకు హాజరవుతున్నారు.

    అయితే.. ఆ తర్వాత కూడా కార్మికుల వర్కింగ్‌ కండిషన్లపై ఇరు వర్గాల మధ్యా చర్చలు నడుస్తున్నాయి. చివరగా సోమవారం నాడు చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలో బుధవారం చాంబర్‌.. ఓ పత్రికా ప్రకటన ద్వారా నూతన వేతనాలను వెల్లడించింది. మూడేళ్ల పాటు ఈ వేతనాల ఒప్పందం అమలులో ఉంటుందని తెలిపింది. దీంతో పాటు ‘చట్ట ప్రకారం నిర్మాత ఎవరితోనైనను పనిచేసుకునే అధికారం కలిగిఉన్నారు', ‘తక్కువ(లో) బడ్జెట్‌/అమెచ్యూర్‌ సినిమాలకు ఈ వేతనములు, నియమ నిబంధనలు వర్తించవు. ఏ సినిమాలు.. తక్కువ బడ్జెట్‌ అనేది చాంబరు వారు నిర్ణయించెదరు' అనే నిబంధనలనూ చేర్చారు.

    అయితే.. వీటికి ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ అభ్యంతరం తెలిపింది. ‘‘నిర్మాతలు..ఎవరితోనైనా పనిచేసుకుంటామంటే వేతనాలు పెంచి ఉపయోగమేంటి? సంఘ సభ్యులతో కాకుండా బయటివాళ్లతో పనిచేయించుకుంటే ఎంతో కాలం నుంచీ చిత్ర పరిశ్రమనే నమ్ముకొని పనిచేస్తున్న కార్మికులకు అన్యాయం చేసినట్లే. పైగా పెంచిన వేతనాలు.. తక్కువ బడ్జెట్‌ సినిమాలకు వర్తించవన్నారు. ఏది తక్కువ బడ్జెట్‌ సినిమానో చాంబర్‌ నిర్ణయిస్తుందన్నారు. ఇవి ఏ రకంగానూ మాకు సమ్మతం కాదు. కార్మికుల ప్రయోజనాలకు భంగం కలిగించే ఈ నియమాలను నిరసిస్తూ గురువారం నుంచి షూటింగ్‌లకు హాజరుకాకూడదని కార్మికులం అంతా ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నాం'' అని వెంకటేశ్‌, రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు.

    దీంతో.. డిసెంబర్‌, జనవరి నెలల్లో తమ సినిమాలను విడుదల చేసే ఉద్దేశంతో వేగంగా.. షూటింగ్‌లు జరుపుతున్న నిర్మాతలపై ఈ సమ్మె తీవ్ర ప్రభావం చూపనుంది. సంక్రాంతి రేసులో నిలిచేందుకు సిద్ధమవుతున్న రెండు పెద్ద హీరోల సినిమాలపైనా ప్రభావం ఉండబోతోంది. నెల క్రితమే సమ్మె ప్రభావంతో నష్టపోయిన పరిశ్రమకు.. మరోసారి సమ్మె అంటే ఇబ్బందేనని పరిశ్రమ వర్గాలు వాపోతున్నాయి. కార్మికులకూ, షూటింగ్‌లో ఉన్న సినిమాల నిర్మాతలకు నష్టం కలగని రీతిలో త్వరగా ఈ సమస్యకు పరిష్కారం లభించాలని కోరుతున్నాయి.

    ఇక మరో ప్రక్క రెండు తప్ప... మిగిలిన డిమాండ్లను అంగీకరించాం- ఎన్వీ ప్రసాద్‌ అని చెప్పారు. ‘‘తెలుగు ఫిల్మ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ మా ముందుంచిన డిమాండ్లను దాదాపుగా అంగీకరించాం. రెండు డిమాండ్ల విషయంలో మాత్రం ఇరు పక్షాల మధ్య సయోధ్య కుదరలేదు'' అని ఫిల్మ్‌ చాంబర్‌ అధ్యక్షుడు ఎన్వీ ప్రసాద్‌ అన్నారు.

    ఆయన మాట్లాడుతూ.. ‘‘మన దేశంలో ఏ చిత్ర పరిశ్రమలో లేని విధంగా వేతనాలు పెంచడానికి చలనచిత్ర వాణిజ్యమండలి అంగీకరించింది.
    ఫెడరేషన్‌ వారు కూడా పెంచిన వేతనాల పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. చిన్న సినిమాలకు ఈ వేతనాలు, నియమనిబంధనలు వర్తించవు. ఏవి చిన్న చిత్రాలనే విషయాన్ని చాంబర్‌ నిర్ణయిస్తుంది. చట్టప్రకారం నిర్మాత ఏ సాంకేతిక నిపుణుడితోనైనా పనిచేయించుకోవచ్చు. కానీ ఫెడరేషన్‌ వారు మాత్రం బయటివారిని అనుమతించకుండా తాము మాత్రమే పనిచేలేలా నిబంధనలు తేవాలని పట్టుబడుతున్నారు. ఈ విషయాల్లో ఇరువర్గాల మధ్య సయోధ్య కుదరలేదు'' అని తెలిపారు.

    అక్టోబర్‌ 21 నుంచి చెల్లించాల్సిన జీతభత్యాల్ని సవరించిన వేతనాలకు అనుగుణంగా చెల్లిస్తామని నిర్మాతల మండలి అధ్యక్షుడు బూరుగుపల్లి శివరామకృష్ణ తెలిపారు. ‘మేముసైతం' కార్యక్రమాన్ని ప్రజలందరూ విజయవంతం చేయాలని ఫిల్మ్‌ చాంబర్‌ సెక్రటరీ కొడాలి వెంకటేశ్వరరావు కోరారు.

    English summary
    The producers and employees are still disagreeing over a clause mandating the former to employ only those technicians who are members of the Federation. If the strike continues, it may affects two big films, Pawan Kalyan and Venky’s Gopala Gopala and NTR Jr’s Temper, both of which are slated to release on Sankranthi alongside Shankar’s I.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X