చరణ్ పెళ్లికి...అభిమానులకు నో ఎంట్రీ!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన వివాహం జూన్ 14న నిర్ణయించిన విషయం తెలిసిందే. ఉదయం 7.30 గంటలకు చరణ్ ఉపాసన మెడలో మూడు ముళ్లు వేయనున్నాడు. గండిపేటలోని ఫాం హౌస్ లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరుగనుంది. ఈ మేరకు ఇరు కుటుంబాలు నిన్న లగ్న పత్రిక మార్చుకున్నాయి. మే మొదటి వారంలో పెళ్లి పత్రికల ముద్రించి వాటిని డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమం మొదలు పెట్టనున్నారు.
14వ తేదీన జరిగే పెళ్లికి దేశంలోని రాజకీయ, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరు కాబోతున్నారు. పెళ్లి జరిగే చుట్టుపక్కల పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలక్ట్రానిక్ ఎంట్రీ కార్డు సిస్టం ఏర్పాటు చేసి వాటితో పత్రికలతో పాటు వాటిని కూడా పంచనున్నారు. ఈ పెళ్లికి ఇరు కుటుంబాలకు చెందిన బంధువులు, విఐపీలు, ప్రముఖులకు మాత్రమే ఆహ్వానం ఉంది.
అయితే అభిమానులకు ఈ పెళ్లిలో ప్రవేశం లేదు. నేరుగా చూసే అవకాశం కల్పించడం లేదు. కేవలం టీవీల్లో చూసి ఆనందించాల్సిందే. భద్రత కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పెళ్లి పూర్తవగానే అదే రోజు రాత్రి సినీ, రాజకీయ ప్రముఖులకు ప్రత్యేకమైన విందు ఏర్పాటు చేస్తున్నారు. అయితే అభిమానులకు మాత్రం ఆ మర్నాడు విందు కార్యక్రమం ఉంటుందని, అక్కడే చరణ్-ఉపాసన అభిమానులను కలుస్తారని చిరంజీవి తెలియజేశారు.
ప్రస్తుతం రామ్ చరణ్ 'జంజీర్' చిత్రంతో పాటు పాటు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'ఎవడు', వివి వినాయక్ దర్శకత్వంలో మరో చిత్రాన్ని చేస్తున్నాడు. పెళ్లి తదనంతరం జరిగే కార్యక్రమాల దృష్ట్యా షూటింగులకు కాస్త బ్రేక్ ఇవ్వనున్నాడు చెర్రీ.


Click it and Unblock the Notifications











