ఇకపై ప్రయోగాలకు స్వస్తి. అభిమానులు మెచ్చే చిత్రాలనే చేస్తాను అంటున్నారు మహేష్ బాబు. దూకుడు విజయోత్సాహంలో ఉన్న మహేష్ మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. గతంలో తాను కొన్ని ప్రయోగాత్మక చిత్రాలు చేసానని అయితే ఇప్పుడు అలాంటివి పెట్టుకోలేనని స్పష్టం చేసారు. అలాగే దూకుడు చిత్రం సక్సెస్‌ను తాను ఎంజాయ్ చేయలేకపోయాననీ, ఎందుకంటే బిజినెస్‌మేన్ షూటింగ్‌లో పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వడమే దీనికి కారణమన్నారు. తన కెరీర్‌లో ఈ చిత్రం బిగ్గెస్ట్ హిట్ అవుతుందని ఆడియో రోజే చెప్పాననీ, ఎందుకంటే... డైరెక్టర్ గారు ఈ విషయాన్ని తనకు ఆనాడే చెప్పాడని అన్నారు. త్వరలో 100 రోజుల వేడుకను గ్రాండ్ సెలబ్రేట్ చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. ఇక దూకుడు చిత్రంలో ఒక తండ్రికి కొడుకుగా, ఎమ్మెల్యేగా, పోలీసాఫీసర్‌గా, సినిమా డైరెక్టర్‌గా నాలుగు డైమన్షన్స్ ఉండే పాత్ర చేశారు... కష్టమనిపించలేదని, కష్టమంతా డైరెక్టర్, టెక్నీషిన్లదే. నాదేముంది డైరెక్టర్ చెప్పమన్నది చేశానంతే....ఈ సక్సెస్ వెనక డైరెక్టర్ శ్రీనువైట్ల కృషి ఎంతగానో ఉంది అన్నారు. ఓవర్‌సీస్‌లో కలెక్షన్లు గురించి చెబుతూ... అక్కడ ఇప్పటిదాకా భారతీయ సినిమా 'త్రీ ఈడియట్స్" లీడింగ్‌లో ఉంది. ఇప్పుడు 'దూకుడు" సెకండ్ ప్లేస్‌లో ఉందన్న న్యూస్ చాలా ఆనందానికి గురిచేస్తోంది. దాదాపు నైజాం ఏరియాతో సమానస్థాయి కలెక్షన్లు విదేశాలలో రాబడుతోంది అన్నారు. ఇక బిజినెస్‌మ్యాన్ ప్రోగ్రస్ గురించి చెబుతూ.. చాలా స్పీడ్‌గా షూటింగ్ జరిగిపోతోంది. దాదాపు అయిపోవచ్చింది. సంక్రాంతికి విడుదలచేయాలనుకుంటున్నారు నిర్మాతలు అని చెప్పుకొచ్చారు.