బాలయ్య నిర్ణయం: బోయపాటి లాంటివాళ్ల పరిస్థితేంటి?
హైదరాబాద్: బాలయ్య నటించిన సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహా, లెజెండ్ లాంటి సినిమాలు బాక్స్ ఆఫీసు వద్ద భారీ విజయం సాధించాయి. రాయలసీమ ఫ్యాక్షన్ కథాంశాలు, కత్తులు, కొడవళ్లు, బాంబులతో అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు, కేక పుట్టించే పవర్ ఫుల్, పొలిటికల్ డైలాగులు ఉండటం వల్లే ఈ చిత్రాలు భారీ విజయం సాధించాయి.
ప్రస్తుతం బాలయ్య రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. హిందూపురం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఇకపై ఆయన ఫ్యాక్షన్, పొలిటికల్ కథాంశంతో కూడిన సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. కేవలం ఎంటర్టెన్మెంట్, ఫ్యామిలీ కథాంశంతో కూడిన సినిమాలు మాత్రమే చేస్తారట.

బాధ్యతగల పొలిటికల్ లీడర్‌గా ఉండి ఫ్యాక్షన్ సినిమాలు చేయడం మంచిది కాదనే ఉద్దేశ్యంతోనే బాలయ్య ఈ నిర్ణయానికి వచ్చారట. అయితే బాలయ్య నిర్ణయం బోయాపాటి శ్రీనుతో పాటు... ఆ తరహా సినిమాలు తీసే వారిని నిరాశ పరచడమే అంటున్నారు పలువురు. ఇప్పటికే పలువురు దర్శకుడు బాలయ్యను ఇమేజ్ దృష్ణిలో పెట్టుకుని అలాంటి కథాంశాలు రెడీ చేసుకున్నారు కూడా. బాలయ్య నిర్ణయంతో వీరంతా షాక్ అయ్యారు.
'లెజెండ్' సినిమా తర్వాత మరో సినిమా చేస్తున్నారు. సత్యదేవ్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని రుద్రపాటి ప్రేమలతా సమర్పణలో రుద్రపాటి రామారావు ఎస్ఎల్‌వి బేనర్లో నిర్మిస్తున్నారు. ఇటీవల రామానాయుడు స్టూడియోలో సినిమాకు సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్.


Click it and Unblock the Notifications











