మా మధ్య గొడవలేం లేవు:ఇలియానా
మా మధ్య ఏవో పొరపొచ్చాలు వచ్చాయని రూమర్స్ వస్తున్నాయి.వాటిలో ఆవగింజంత నిజం కూడా లేదు అంటూ క్లారిఫికేషన్ ఇచ్చింది గోవా భామ ఇలియానా.ఆమె తాజాగా హిందీలో బర్భి చిత్రం చేస్తోంది.అందులో మరో ముఖ్యమైన పాత్రలో చేస్తున్న ప్రియాక చోప్రాతో ఆమెకు చాలా గొడవలయ్యాయని సెట్ మీదే కొట్టుకున్నారని వార్తలు వచ్చాయి.వాటిని ఉద్దేశించి ఆమె ఇలా స్పందించారు.అలాగే ప్రియాంక చోప్రా చాలా ఆప్యాయంగా ఉంటారు. ఆమెతో కలిసి నటించడం చాలా ఈజీ అంది.
ఇక రెమ్యునేషన్ తగ్గించింది..వేషాలు లేక అనే టాపిక్ మీద మాట్లాడుతూ..ఇలియానా కోటి రూపాయలు తీసుకొంటోంది. అంతకంటే ఎక్కువే అడుగుతోంది. ఇప్పుడు తగ్గించింది అంటున్నారు. ఎక్కువ తీసుకొందీ అన్నప్పుడూ నేను మాట్లాడలేదు. తగ్గించింది అన్నప్పుడూ మాట్లాడను. నాకు సంబంధం లేకుండా నా రెమ్యునేషన్ పై అనేక చర్చలు సాగుతున్నాయి అంది. ప్రస్తుతం ఈ గోవా భామ హిందీలో 'బర్ఫీ', శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తోంది.


Click it and Unblock the Notifications











