ఆ హీరో తో గొడవ పడలేదు: ఇలియానా ఖండన
''ఇలాంటివన్నీకేవలం రూమర్స్ మాత్రమే. మా మధ్య ఎలాంటి గొడవ రాలేదు.రణబీర్ నాతో మాట్లాడటం లేదనీ పుకార్లు వచ్చాయి. అందులోనూ నిజం లేదు'' అని చెప్తోంది ఇలియానా. ఆమె తాజాగా బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తూ 'బర్ఫీ' అనే చిత్రం చేస్తోంది. షూటింగ్ సమయంలో రణబీర్ తో గొడవ పడిందని, ప్రియాంక చోప్రాతో పడటం లేదని, తెలుగు, తమిళంలో తాను స్టార్ కావటంతో అక్కడ కూడా అలాగే బిహేవ్ చేస్తోందని,వారు దాన్ని జీర్ణించుకోలేక వివాదాలు వస్తున్నాయని బాలీవుడ్ పత్రికలు రాస్తున్నాయి.ఈ విషయంపై వెంటనే ఇలియానా స్పందిస్తూ మీడియాకు తెలియపరిచింది. అలాగే ప్రియాంక చోప్రా..సీనియర్ నటి అని ఆమెతో స్నేహ పూర్వక సంభందాలే ఉన్నాయని చెప్పుకొచ్చింది.ఇక ఈ గోవా భామ నటిస్తున్న ఈ చిత్రంని అనురాగ్ బసు డైరక్ట్ చేస్తున్నారు. ఇందులో ఇలియానా అరవై ఏళ్ళ ముసలిదానిగా నటిస్తోంది. ఇక తెలుగులో కోటి రూపాయలందుకొన్న ఇలియానా హిందీలో సగం పారితోషికానికే నటిస్తోంది.


Click it and Unblock the Notifications











