విసుగెత్తిపోయిన రాజమౌళి: చరణ్-ఎన్టీఆర్ మూవీపై కీలక నిర్ణయం!
Recommended Video

బాహుబలి-2 తర్వాత దర్శకుడు రాజమౌళి ఏ సినిమాలు చేస్తారు? అనే విషయంలో ఎట్టకేలకు ఓ క్లారిటీ వచ్చిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ యంగ్ టాప్ స్టార్స్ అయిన రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్లో ఆయన మల్టీ స్టారర్ సినిమా చేయబోతున్నారు.
బాక్సింగ్ క్రీడ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోంది. ఇందులో ఇద్దరూ స్టార్లు బాక్సర్లుగా కనిపించబోతున్నారు. త్వరలోనే ఈ చిత్రం గురించి అఫీషియల్ ప్రకటన చేస్తూ టైటిల్ ప్రకటించనున్నారు.

విసుగెత్తిపోయిన రాజమౌళి
రాజమౌళి గత సినిమాలు బాహుబలి, బాహుబలి 2, ఈగ, మగధీర, యమదొంగ ఇలా దాదాపు అయన తెరకెక్కించిన భారీ చిత్రాలన్నింటిలోనూ ఎక్కువ శాతం గ్రాఫిక్స్ వాడారు. మామూలు సినిమా తీయడం కంటే, గ్రాఫిక్స్‌తో కూడిన సినిమా తీయడం ఎక్కువ సమయం తీసుకోవడంతో పాటు, ఎక్కువ శ్రమతో కూడున్నది. గత కొన్నేళ్లుగా ఈ విధంగా శ్రమ పడుతున్న రాజమౌళి విసిగిపోయారు.

గ్రాఫిక్స్ లేకుండా సినిమా చేస్తానని చెప్పిన రాజమౌళి
‘బాహుబలి -2' విడుదల అనంతరం రాజమౌళి మీడియాతో మాట్లాడుతూ తన తర్వాతి సినిమా ఎలాంటి గ్రాఫిక్స్ లేకుండా చేస్తాని చెప్పారు. ఆ మాట ప్రకారమే రాజమౌళి తన సినిమాను ప్లాన్ చేసుకుంటున్నారట.

రామ్ చరణ్-ఎన్టీఆర్ సినిమా
ఏ సినిమాకు అయినా కథను బట్టే గ్రాఫిక్స్ వాడటమా? లేదా? అనేది ఆధారపడి ఉంటుంది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న రామ్ చరణ్-ఎన్టీఆర్ సినిమా ఎలాంటి గ్రాఫిక్స్ అవసరం లేదని, అందుకు తగిన విధంగానే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్టు సిద్ధం చేసుకున్నారని టాక్.

సినిమా ఎప్పుడు మొదలవుతుంది?
ప్రస్తుతం రామ్ చరణ్ సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం' సినిమా చేస్తున్నారు. మరో వైపు ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. వారి వారి కమిట్మెంట్స్ పూర్తయిన తర్వాతే రాజమౌళి సినిమా ప్రారంభం కాబోతోంది. 2018 ద్వితీయార్థంలోనే సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











