జూ ఎన్టీఆర్‌కు నాగచైతన్య ఝలక్!
తాత ఎన్టీఆర్ పేరు ప్రఖ్యాతలకు తోడు, తన సూపర్ పెర్ఫార్మెన్స్‌తో టాలీవుడ్ టాప్ హీరో స్థాయికి ఎదిగాడు జూనియర్ ఎన్టీఆర్. తాత నటించిన సూపర్ హిట్ సినిమాల రీమేక్‌లో నటించాలని జూనియర్ చాలా కాలంగా ఉవ్విల్లూరుతున్నాడు. అలాంటి సినిమాల్లో అప్పట్లో వచ్చిన 'గుండమ్మ కథ" ఒకటి. గుండమ్మ కథలో ఎన్టీఆర్, ఎఎన్ఆర్ కలిసి నటించారు. ఇప్పుడు అదే సినిమా రీమేక్‌లో అక్కినేని యువహీరో నాగచైతన్యతో కలిసి చేద్దామని ప్లాన్‌లో ఉన్నాడు జూనియర్. జూనియర్ ప్రతిపాదనకు నాగచైతన్య అప్పట్లో సానుకూలంగానే స్పందించాడు. అయితే తాజాగా ప్లాన్ రివర్స్ అయింది. 'గుండమ్మ కథ" రీమేక్‌లో నటించకూడదని నాగచైతన్య నిర్ణయించుకున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.
నాగచైతన్య ఈ విధంగా జూనియర్ ఎన్టీఆర్‌కు ఝలక్ ఇవ్వడం వెనక పెద్ద స్టోరీనే ఉంది. ఇటీవల దడ ప్లాపుతో పునరాలోచనలో పడిన చైతు...ఇకపై చాలా జాగ్రత్తగా ఆచితూచి సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. పైగా గుండమ్మకథ రీమేక్‌లో నటిస్తే తనకు ఒరిగేదేమీ లేదు. క్రెడిట్ అంతా జూనియర్ ఎన్టీఆర్‌కే పోతుంది. పైగా తనను అంతా సెకండ్ హీరోగా చూస్తారు. ఈ విషయాల గురించి బాగా ఆలోచించిన నాగచైతన్య గుండమ్మ కథ రీమేక్‌కు దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యాడట. ఈ నేపథ్యంలో జూనియర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి మరి..


Click it and Unblock the Notifications











