ఫేస్‌బుక్, ట్విట్టర్ లలో తన ఎకౌంట్స్ గురించి క్లారిటి ఇచ్చిన కాజల్
కాజల్ పేరుతో ఫేస్ బుక్ లో పేజీలు, ట్విట్టర్ లో ఎకౌంట్స్ ఉన్నాయి. వాటిని చాలా మంది రోజూ ఫాలో అవుతున్నారు.ఈ విషయమై కాజల్ మాట్లాడుతూ..నేను గాడ్జెట్ గాళ్‌ని కాను. నాకు కంప్యూటర్, లాప్‌టాప్‌లంటే అసలు పడవు. అందుకే నాకు ఫేస్‌బుక్, ట్విట్టర్ అకౌంట్స్ కూడా లేవు. ఇప్పుడు నెట్‌లో ఉన్నవన్నీ భోగసే. ఫ్యాన్స్ ఎవరూ వీటిని నమ్మకండి. నేను ఒక వేళ ఎవరికైనా మెసేజ్ చేయగలిగితే మొబైల్ ద్వారా ఎస్.ఎం.ఎస్.ఇవ్వడం గానీ, ఫోన్ చేయడంగానీ చేస్తా అని చెప్పింది. కాబట్టి ఎవరూ కాజల్ పేరుతో ఉన్న ట్విట్టర్ లేదా ఫేస్ బుక్ పేజీలను ఫాలో అవ్వాల్సిన పనిలేదు. ప్రస్తుతం కాజల్ తెలుగులో నాగచైతన్య సరసన ఓ ఎన్నారై గాళ్‌గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్‌లో అజయ్ దేవగన్ సరసన 'సింగం' చేస్తోంది. ఇక మహేష్ బాబు సరసన 'ది బిజినెస్ మేన్' సినిమాలోనూ, తమిళంలో సూర్య సరసన కొత్తగా కమిటైంది.


Click it and Unblock the Notifications











