twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భజ్జీతో పెళ్లిపై ట్విస్ట్ ఇచ్చిన హాట్‌లేడీ

    By Bojja Kumar
    |

    బాలీవుడ్ హాట్ బ్యూటీ గీతా బస్రాతో క్రికెటర్ హర్భజన్ సింగ్ వివాహం ఖరారైనట్లు, త్వరలోనే ఇరు కుటుంబాల పెద్ద అంగీకారంతో ఇద్దరు ఏకం కాబోతున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. హర్భజన్, గీతా బస్రా ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో వివాహం చేసుకోబోతున్నట్లు జాతీయ మీడియాలో సైతం గాసిప్స్ వెలువడ్డాయి.

    ఇన్నాళ్లూ ఈ వార్తలపై స్పందించని గీతా బస్రా...తాజాగా ఈ విషయాన్ని ఖండించి ట్విస్ట్ ఇచ్చింది. మేమిద్దరం మంచి స్నేహితులం అంటూనే తనకు ఇప్పుడే పెళ్లి ఆలోచన లేదని అంటోంది. మరి ఇంత కాలం నుంచి వార్తలు వినిపిస్తున్నా స్పందించక పోవడానికి కారణం సమయం దొరకక పోవడమేనట. భవిష్యత్‌లో అయినా పెళ్లి చేసుకుంటారా? అంటే మేమిద్దరం స్నేహితులం, అయినా మా వ్యక్తిగత విషయాల గురించి చెప్పాలిన అవసరం లేదు. ఇప్పటివరకైతే పెళ్లి గురించి నేనేమీ ఆలోచించలేదు అంటూ తెలివిగా సమాధానం ఇస్తోంది. మీడియా మాకు ఇప్పటికే ఆరు సార్లు పెళ్లి చేసింది. ఇది నిజంగా ఫన్నీ...అంటూ సెటైర్లు వేస్తూ గడుసుగా మాట్లాడుతోంది.

    మోడల్‌గా, ఆపై ఇ్రమాన్ హస్మి హీరోగా వచ్చిన 'ట్రైన్' చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన గీతా బస్రా ప్రస్తుతం జిల్లా గజియాబాద్ చిత్రంలో నటిస్తోంది. ఈచిత్రంలో సంజయ్ దత్, వివేక్ ఒబెరాయ్ ముఖ్య పాత్రల్లో నటిస్తోంది. ఈ చిత్రంతో పాటు 'దస్' సీక్వెల్‌లో, పంజాబీ చిత్రంలో నటిస్తోంది.

    సినిమా సెలబ్రిటీలు తమ పబ్లిసిటీ పెంచుకోవడం కోసం ఇలాంటి సంబంధాలు కొనసాగించడం మామూలే. వాళ్ల మధ్య డాష్ డాష్ సంబంధం ఉందట అంటూ తమ గురించి జనం గుసగుసలాడుకుంటుంటే ఎంజాయ్ చేయడం ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది. పైగా ఫ్రీ పబ్లిసిటీ. ఇప్పటికే చాలా మంది ఉపయోగించిన ఈ ఫార్ములాను తాజాగా ఈ పంజాబీ లేడీ కూడా అవపోశన పట్టినట్లుంది!

    English summary
    "I have no idea about marriage right now. I have been married over six times with Bhajji in the last few years. We were even in the news for our break-up, apparent fights and what not. This is ridiculous. I don't know why people are talking about it," Geeta Basra says.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X