నేను ఎన్టీఆర్ ని అనుకరించలేదు: బాలకృష్ణ
బాలకృష్ణ తాజా చిత్రం 'అధినాయకుడు'ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయిటపడి వచ్చే నెల మొదటి తేదీన విడుదలకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేఫధ్యంలో ఈ చిత్రం లో బాలకృష్ణను మీడియా కలసింది. చిత్రంలోని ముసలి గెటప్ పై ఆయన్ని ప్రశ్నించింది. ఆ గెటప్ గతంలో బాలకృష్ణ తండ్రి సీనియర్ ఎన్టీఆర్ చేసిన బడిపంతులు,కుల గౌరవం చిత్రాల లోని గెటప్స్ ని గుర్తుకు తెస్తోందని అడిగారు. దానికి బాలకృష్ణ ..అటువంటిదేమి లేదని సమాధానమిచ్చారు.
బాలకృష్ణ మాటల్లోనే...నేను ఎప్పుడూ మా నాన్నగారిని ఏ విధంగానూ ఇమిటేట్ చేయటానికి ప్రయత్నించలేదు. ఆయన నన్ను సొంత స్టైల్ తో డవలప్ అవమని ఎడ్వైజ్ చేసారు. ఆయనతో సహా ఎవరినీ అనుకరించవద్దని చెప్పారు. కాబట్టి నాకు ఆయన ఇన్ఫూలియన్స్ నాపై పడే అవకాసం లేదుని తేల్చి చెప్పారు. ఇక చిత్రం గురించి చెపుతూ..అది యాక్షన్ తో కూడిన ఓ చక్కటి ఫ్యామిలీ డ్రామా అన్నారు. రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో కథ నడుస్తుంది .రెండు గంటలు సేపు ఆడియన్స్ మెస్మరైజ్ అయ్యి చూస్తారు అన్నారు.
దర్శకుడు పరుచూరి మురళి ఈ చిత్రం గురించి మాట్లాడుతూ ..“ ప్రజలకు సేవ చేసే నిజమైన నేత, వారి కష్ట సుఖాలలో పాలు పంచుకునే నేత ఎలా ఉండాలో అధినాయకుడు చూపిస్తుందని చెప్పిన మాటలు కూడా మరింత ఆసక్తి పెంచుతున్నాయి. ఈ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ రాజకీయ విశేషాలు కూడా కలగలిసి ఉండవచ్చని పిల్మ్ నగర్ టాక్. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్లుగా సలోని, లక్ష్మి రాయ్ నటిస్తున్నారు.గతంలో చెన్నవకేశవరెడ్డి, ఒక్క మగాడు చిత్రాల్లో ఓల్డేజ్ గెటప్ లో కనిపించిన బాలయ్య అధినాయకుడులో మరోసారి ఆ క్యారెక్టర్ చేస్తున్నారు.
ఇక ఈ చిత్రంలో బాలకృష్ణ త్రిపాత్రాభినయం చేస్తుండటం విశేషం. పరుచూరి మురళి దర్శకత్వంలో ఎమ్.ఎల్ కుమార్‌చౌదరి నిర్మిస్తోన్న ఈ చిత్రం ఆరు పాటలు సహా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. బాలకృష్ణ ఇందులో తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్నారు.'అధినాయకుడు' చిత్రాన్ని కీర్తి కంబైన్స్ పతాకంపై ఎమ్మెల్ కుమార్ చౌదరి నిర్మిస్తు న్నారు. ఈ చిత్రంలో లక్ష్మీరాయ్, చార్మి, సలోని హీరోయిన్లుగా నటిస్తున్నారు.
శ్రీరామ రాజ్యం వంటి భక్తి రసాత్మక చిత్రం తర్వాత ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ మూవీగా 'అధినాయకుడు' రాబోతోంది. తాతగా, తండ్రిగా, తనయుడిగా ఒకదానితో ఒకటి పొంతనలేని పాత్రల్లో ఆయన కనిపిస్తారు. జయసుధ, సలోని, లక్ష్మీరాయ్ ఆ మూడు పాత్రలకు జోడీలుగా నటిస్తున్నారు. కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, చరణ్‌రాజ్, ఎమ్మెస్‌నారాయణ, వేణుమాధవ్, ఆదిత్యమీనన్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, సమర్పణ: సందీప్.


Click it and Unblock the Notifications











