ఇంటర్వెల్ లేని అమీర్ ఖాన్ 'దోబీఘాట్' (ప్రివ్యూ)
ఈ రోజు రిలీజ్ అవుతున్న అమీర్ ఖాన్ తాజా చిత్రం 'దోబీఘాట్' కి ఇంటర్వెల్ బ్యాంగ్ ఉండటం లేదని సమచారం. ఈ మేరకు అమీర్ ఖాన్ మల్టీఫ్లెక్స్ యజమానులతో చర్చించి కంటిన్యూగా సినిమాని ప్రదర్శించేందుకు నిర్ణయం తీసుకున్నాడని చెప్తున్నారు. 95 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రానికి ఇంటర్వెల్ ఇస్తే అప్పటికే పూర్తిగా కథలో లీనమైన ప్రేక్షకుడిని బలవంతంగా బయటకు తీసుకొచ్చేసినట్లవుతుందని అమీర్ చెప్తున్నాడు. అయితే ఇంటర్వెల్ లో ధియోటర్లలో వ్యాపారం చేసుకునే వ్యాపారులను దృష్టిలో పెట్టుకుని కొందరు ధియోటర్ ఓనర్స్ ఒప్పుకోలేదు. కానీ అమీర్ ఖాన్ అలా ఒప్పుకున్న వారికే ఈ చిత్రాన్ని రిలీజ్ కు ఇచ్చాడు. అయితే ఈ కండీషన్ ముంబై వరకే పరిమితం కాబోతోంది. 'దోబీఘాట్'కి అమీర్ భార్య కిరణ్‌రావ్ దర్శకత్వం వహించారు. ఇందులో అమీర్ ఖాన్ పెయింటర్ గా కనిపిస్తారు.
ఇక ఈ చిత్రం గురించి అమీర్ ఖాన్ మాట్లాడుతూ..."ఈ సినిమా మాస్ జనాలకి నచ్చదు! ఎందుకంటే ఇది సున్నితమైన విషయంతో కూడుకొన్న కథ. ఎవరైతే సున్నితమైన మనసు కలిగి ఉంటారో వారే ఈ సినిమాను అర్థం చేసుకొంటారు అన్నారు. అలాగే ఈ చిత్రం కథ గురించి చెబుతూ..భిన్న తరగతులకు చెందిన వ్యక్తుల అనుబంధాలు ఎలా ఉంటాయో 'దోభీ ఘాట్'లో చూపించాం. షాయ్ అనే ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్ కి..మున్నా అనే లాండ్రీ అబ్బాయికి..అరుణ్ అనే చిత్రకారుడికి మధ్య జరిగే కథ ఇది.మోనికా డోగ్రా, ప్రతీక్ బబ్బర్ కీలక పాత్రధారులు. నా నిర్మాణ సంస్థ నుంచి రాబోతున్న ఓ మంచి చిత్రమిది అని అమీర్ ఖాన్ అన్నారు.
ఇక ఈ చిత్రం టైటిల్ నుంచి ధోభి అనే పదాన్ని తొలిగించమంటూ కోర్టులో కేసు నమోదైంది. హిందుస్తాన్ కనోజ ఆర్గనైజేషన్ ఆఫ్ ధోబీస్ ఛైర్మన్ వినోద్ కుమార్ కనోజ్ తమ ధోభి కమ్యునిటీని అవమానపరిచేదిలా ఉందంటూ డిల్లీ హైకోర్టులో పిటీషన్ ఫైల్ చేసారు. ఆ కేసు ఇప్పటికి తెమిలింది. ఇప్పటికే ఈ చిత్రం వివిధ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ఈ సినిమా ప్రదర్శితమై విమర్శకుల ప్రశంసలు పొందింది.


Click it and Unblock the Notifications











