టైటిల్ కలేజా కాదు...మహేష్ బాబు
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి కలేజా అనే టైటిల్ ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆ టైటిల్ కలేజా కాదు అని మహేష్ తాజాగా ట్విట్టర్ లో మెసేజ్ పాస్ చేసారు. అలాగే ఆ చిత్రానికి మంచి టైటిల్ సజెస్ట్ చేయమంటూ రిక్వెస్ట్ చేసారు. కాబట్టి ట్విట్టర్ ఉపయోగిస్తున్న మహేష్ అభిమానులు తాము మెచ్చే టైటిల్ ని ట్విట్టర్ లో పోస్ట్ చేసి సమాధానమివ్వవచ్చు. నచ్చితే మహేష్ మెచ్చుకుని ఉపయోగించుకోనూ వచ్చు. ఇక అనూష్క హీరోయిన్ గా రూపొందే ఈ చిత్రం ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ అనీ, హీరో క్యాబ్ డ్రైవర్ అని తెలుస్తోంది.
మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ అనుష్క కలేజా అతడు సింగనమల రమేష్ mahesh babu trivikram srinivas anushka khaleja athadu


Click it and Unblock the Notifications