‘ఇద్దరమ్మాయిలతో’ చిత్రంలో ఐటం సాంగ్ లేదు
హైదరాబాద్ : పూరి జగన్నాథ్ సినిమా అంటేనే ఐటం సాంగ్ తప్పనిసరి. పూరి దర్శకత్వంలో వచ్చిన ఏ సినిమా చూసినా అందులో హాట్ హాట్ ఐటం సాంగు ఉండి తీరాల్సిందే. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా రూపొందిస్తున్న 'ఇద్దరమ్మాయిలతో' చిత్రంలో మాత్రం సాంగు లేకుండానే సినిమా ప్లాన్ చేసారట పూరి జగన్నాథ్.
సినిమా స్టోరీ ప్రకారం ఐటం సాంగు సెట్ కాదని, అందుకే ఐటం సాంగు లేకుండా ఈ సినిమాకు తెరకెక్కించారని యూనిట్ సభ్యులు అంటున్నారు. అయితే ఇందులో దేవషి కందూరి అనే బాలీవుడ్ భామతో స్పెయిన్లో స్పెషల్ సాంగ్ చిత్రీకరణ జరిపినప్పటికీ అది ఐటం సాంగు కాదని, కథలో భాగంగానే ఆ పాట సాగిపోతూ ఉంటుందని అంటున్నారు.
ఈ చిత్రంలో బన్నీ సరసన అమలపాల్, కేథరిన్ నటిస్తున్నారు. స్పెయిన్ దేశంలో 'ఇద్దరమ్మాయిలతో' చిత్రానికి సంబంధించిన మేజర్ పార్ట్ చిత్రీకరించనున్నారు. మే 10న ఈ చిత్రం విడుదల కానుంది. ఈచిత్రంలో అల్లు అర్జున్ తన ఒంటిపై టాటూలతో కనిపించనున్నాడు.
ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ దీనికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శ్యామ్.కె.నాయుడు, నృత్యాలు: దినేష్, కళ: చిన్నా, కూర్పు: ఎస్.ఆర్.శేఖర్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. కో-రైటర్స్: బి.వి.ఎస్. రవి, కళ్యాణ్ వర్మ.


Click it and Unblock the Notifications











