కర్ణాటకలో ఒక్క షో కూడా పడని కాలా.. రజనీ ఫ్యాన్స్ అంతా ఆ ఊరికి పయనం!

Recommended Video

బెంగళూరులో ఇంకా విడుదల కాని కాలా

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కాలా చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదలయింది. ఒక్క కర్ణాటకలో తప్ప. కావేరి జల వివాద నేపథ్యంలో కర్ణాటన ఆందోళన కారులు కాలా విడుదలని అడ్డుకున్నారు. కాలా చిత్రాన్ని కర్ణాటకలో విడుదుల చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆందోళలన కారులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కాలా ఒక్క షో కూడా పడలేదు. కావేరి జలవివాదం విషయంలో రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు కన్నడిగులని తీవ్ర ఆగ్రహానికి గురిచేసిన సంగతి తెలిసిందే.

 పంతం నెగ్గించుకున్న కన్నడిగులు

పంతం నెగ్గించుకున్న కన్నడిగులు

రజనీకాంత్ వ్యాఖ్యల వలన ఆగ్రహానికి గురైన కన్నడిగులు చివరకు వారి పంతాన్నే నెగ్గించుకున్నారు. కర్ణాటక వ్యాప్తంగా కాలా చిత్రం ఒక్క షో కూడా పడకుండా అడ్డుకోగలిగారు.

రజనీకాంత్ విన్నవించుకున్నా

రజనీకాంత్ విన్నవించుకున్నా

తాను చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి వివాదమూ లేదని కాలా చిత్రాన్ని విడుదల అయ్యేలా సహకరించాలని స్వయంగా సూపర్ స్టార్ రజనీకాంత్ వేడుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

 సుప్రీం కోర్టు తీర్పు

సుప్రీం కోర్టు తీర్పు

రజనీకాంత్ కాలా చిత్రం కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోంది. కాబట్టి కాలా చిత్రం విడుదల ఆపే విధంగా స్టే ఇవ్వలేము, కాలా చిత్రం ప్రశాంతంగా విడుదల అయ్యేలా కర్ణాటక ప్రభుత్వం భద్రత కల్పించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.

 సైలెంట్‌గా ఉండిపోయిన ప్రభుత్వం

సైలెంట్‌గా ఉండిపోయిన ప్రభుత్వం

కాని కర్ణాటక ప్రభుత్వం మాత్రం ఈ వ్యవహారంలో తల దూర్చడానికి ఇష్టపడలేదు. సుప్రీం సూచనలని సైతం పక్కన పెట్టి సైలెంట్ గా ఉండిపోయింది.

రజని ఫ్యాన్స్ ఆ ఊరికి పయనం

రజని ఫ్యాన్స్ ఆ ఊరికి పయనం

కాలా చిత్ర బ్యాన్ తో కర్ణాటక రజని ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. దీనితో కాలా విడుదలవుతున్న పొరుగు రాష్ట్రాలకు వారు పయనం అవుతున్నారు. బెంగుళూరు రజని ఫ్యాన్స్ కర్ణాటక బోర్డర్ లో ఉన్న హోసూర్ నగరానికి చేరుకుంటున్నారు. ఎలాగైనా రజనీ సినిమా తొలి రోజు చూడాలని భావించే అభిమానులు ఇలాంటి మార్గాలని అన్వేషిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X