ముగ్గురితో ముద్దు సీన్‌పై సమంత వివరణ
హైదరాబాద్ : హాట్ హీరోయిన్ సమంత ప్రస్తుతం గౌతం మీనన్ దర్శకత్వంలో 'ఎటో వెళ్లి పోయింది మనసు' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఈచిత్రానికి సంబంధించిన విడుదలన నాని-సమంత ఫోటో ఈ చిత్రంలో ముద్దు సీన్ ఉందనే వార్తలకు తెర తీసింది. అంతే కాదు తెలుగు వెర్షన్లో ఇద్దరి మధ్య ముద్దు సీన్ ఉందంటే....తమిళ వెర్షన్లో జీవాతో, హిందీ వెర్షన్లో ఆదిత్య రాయ్ కపూర్‌తో కూడా సమంత ముద్దు సీన్ చేసే ఉంటుందనే పుకార్లు కూడా వినిపించాయి.
ఈ వార్తల నేపథ్యంలో హీరోయిన్ సమంత క్లారిటీ ఇచ్చింది. 'ఎటో వెళ్లి పోయింది మనసు' చిత్రంలో ఎలాంటి ముద్దు సీన్ లేదని, సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుని ఎలాంటి కట్స్ లేకుండా క్లీన్ 'U' సర్టిఫికెట్ పొందిందని వెల్లడించింది. రూమర్లను నమ్మ వద్దని, మీడియా కూడా ఇలాంటి వారిని ప్రచారం చేయ వద్దని తన ట్విట్టర్లో వేడుకుంది.
ప్రేమ కథా చిత్రాలు తీయడంలో దర్శకుడు గౌతం మీనన్ తనదైన శైలిని అనుసరిస్తూ ఉంటాడు. గతంలో గతం మీనన్ దర్శకత్వంలో వచ్చిన 'చెలి', 'ఏ మాయ చేసావె' చిత్రాలు రెగ్యులర్ ప్రేమ కథా చిత్రాలే అయినా.... విభిన్నమైన ఆకట్టుకునే స్క్రీన్ ప్లేతో పాటు, డిఫరెంట్ క్లైమాక్స్ ఉండటం వల్లనే మంచి విజయం సాధించడం జరిగింది. ఇప్పుడు తన తాజా సినిమా 'ఎటో వెళ్లి పోయింది మనసు' చిత్రం విషయంలో కూడా గౌతం మీనన్ అదే ఫాలో అవుతున్నాడు. ఈ చిత్రంలో 22 నిమిషాల పాటు సాగే హార్ట్ టచ్చింగ్ క్లైమాక్స్ సినిమాకే హైలెట్ కానుందని సమాచారం.
ఈ చిత్రం డిసెంబర్ 14న విడుదలకు సిద్ధం అవుతోంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోన్న ఈ చిత్రం తెలుగు వెర్షన్‌లో హీరోగా నాని నటిస్తుండగా... తమిళ, హిందీ వెర్షన్లలో హీరోలుగా జీవా, ఆదిత్యరాయ్ కపూర్ నటిస్తున్నారు. ఈ మూడు భాషల్లోనూ సమంతానే కథానాయిక కావడం విశేషం.


Click it and Unblock the Notifications











