రామ్ చరణ్ అయినా, జూ ఎన్టీఆర్ అయినా రూల్స్ రూల్సే...!?
100%లవ్ లో హైపర్ బోలాని భలేగా కెమెరా ముందు పరిచేసిన తమన్నా బద్రినాథ్ లో అయితే ఎక్స్ పోజింగ్ డోస్ మరికాస్త పెంచేసిందని, ఇదే ఊపులో తమన్నా ఎంగిలి ముద్దులకి, టూ పీస్ బికినీలకి కూడా సై అంటుందని ఊహాగానాలు సాగుతున్నాయి. అయితే తాను అందుకు మాత్రం సిధ్దంగా లేనని తమన్నా తెగేసి చెబుతోంది.
రామ్ చరణ్ సినిమాలో బికినీ వేయనుందని, జూ ఎన్టీఆర్ తో నటిస్తున్న 'ఊసరవెల్లి' లో లిప్ లాక్ చేయనుందని వార్తలు వచ్చాయి. అందుకు నిర్మాతల దగ్గర అదనంగా డబ్బులు వాసులు చేసిందని కూడా వార్తలు వచ్చాయి. ఐతే తమన్నా ఈ వార్తలను కొట్టిపారేసింది. ఎంత పెద్ద హీరోలతో నటించినా కానీ తన రూల్స్ మార్చుకునే ప్రసక్తే లేదని తమన్నా తేల్చడంతో ఆమెతో విపరీతంగా ఎక్స్ పోజింగ్ చేయించాలనే ఐడియాలున్న దర్శకులు కూడా డ్రాప్ అయిపోతున్నారు. తమిళంలో ఇలాంటి నియమాలు ఖచ్చితంగా అమల్లో పెట్టి కూడా సక్సెస్ అయ్యానని, టాప్ కి చేరుకోవాలంటే అందాల ప్రదర్శన మాత్రమే దారి కాదని తమన్నా తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టింది.


Click it and Unblock the Notifications