ముద్దు పెట్టుకొంటే మటాష్.. లాక్‌డౌన్ ఎత్తేసినా లిప్‌లాక్, శృంగారానికి కష్టమే!

దేశీ సినిమాలంటే ముద్దు, ముచ్చట, రొమాంటిక్, యాక్షన్, కామెడీ లాంటి అంశాలు కలిసి ఉంటాయి. పాటలు, ఫైట్స్ లేకుండా భారతీయ సినిమాలు ఊహించుకోవడం కష్టం. దశాబ్దాలుగా ఈ వాతావరణం దేశ సినిమా పరిశ్రమలో భాగమయ్యాయి. గతంలో ముద్దంటే చేదుగా ఉండేది. కానీ ఇటీవల కాలంలో లిప్‌లాక్‌ అనేవి చాలా సాధారణంగా మారిపోయాయి. అయితే ఇక ముందు కూడా ముద్దు సీన్లు, రొమాంటిక్ సీన్లు ప్రేక్షకులకు కంటికి కనిపించడం కష్టమేనా అనే వాదన తెరపైకి వచ్చింది. దాంతో మాస్ ప్రేక్షకులు వెండితెరపైన శాఖాహార భోజనాన్ని ఆరగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలా ఎందుకంటే..

తప్పనిసరిగా లిప్‌లాక్స్, రొమాంటిక్ సీన్లు

తప్పనిసరిగా లిప్‌లాక్స్, రొమాంటిక్ సీన్లు

గత 5 ఏళ్లలో రొమాంటిక్ కామెడీ చిత్రాల్లో చాలా మార్పులు చోటుచేసుకొన్నాయి. కౌగిలింతలు, చేతిలో చేతి వేసుకొని తిరగడాలు, లిప్ లాక్స్ ఫ్రెంచ్ కిసెస్ తెలుగు తెరపైనే కాకుండా ఇతర భాషల్లో తప్పనిసరిగా మారాయి. ట్రైలర్లలో కూడా వీటిని జొప్పించి ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతున్నారు. రాజ్ తరుణ్, కార్తికేయ నుంచి విజయ్ దేవరకొండ వరకు చాలా యువ హీరోల సినిమాల్లో ఇలాంటివి లేకుండా ఊహించుకోలేం.

ఒకవేళ లాక్‌డౌన్ ఎత్తివేసినా

ఒకవేళ లాక్‌డౌన్ ఎత్తివేసినా

కరోనా మహమ్మారి వ్యాప్తి విస్తృతంగా ఉన్న సమయంలో ఒకవేళ లాక్‌డౌన్ ఎత్తివేసి సినిమాల షూటింగులకు అనుమతించినా వాటిపై ఆంక్షలు కొనసాగేలా చర్యలు తీసుకోబోతున్నట్టు తెలుస్తున్నది. కోవిడ్ 19 పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కఠినతరమైన నిబంధనలు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయనేది తాజా సమాచారం. రాబోయే నిబంధనల ప్రకారం హీరో హీరోయిన్లు భౌతికంగా ఒకరినొకరు తాకకుండా ఉండాలని సూచిస్తారట.

తైవాన్‌ ఇండస్ట్రీలో కఠినంగా

తైవాన్‌ ఇండస్ట్రీలో కఠినంగా

కరోనా పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే తైవాన్ సినీ పరిశ్రమలో ఈ నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చినట్టు తెలిసింది. ఈ నిబంధన ప్రకారం శృంగారపరమైన సీన్లు చిత్రీకరించకుండా చర్యలు తీసుకోవాలని పరిశ్రమ వర్గాలకు తైవాన్ సెన్సార్, ప్రభుత్వ అధికారులు సూచించారట. కరోనావైరస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే వరకు ఈ నిబంధనను కొనసాగిస్తారట.

అదే బాటలో యూకే

అదే బాటలో యూకే

కరోనా అతలాకుతలం చేస్తున్న యూకేలో కూడా ఇలాంటి రూల్‌ను అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారట. ఈ నిబంధన ప్రకారం కేవలం సినిమా పరిశ్రమకే కాకుండా టెలివిజన్ రంగానికి కూడా వర్తింప జేశారట. ఇలాంటి నిబంధనలు భారతీయ సినిమా, టెలివిజన్ పరిశ్రమలో కూడా అమలు చేయాలనే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని తెలుస్తున్నది. ఇంకా కొద్దికాలం సినిమా షూటింగులు, వ్యాపార కార్యక్రమాలను నిలిపివేసే దిశగా కేంద్రం అడుగులేస్తున్నది.

Recommended Video

Jabardasth Anchor Anasuya Hindi Web Series | Filmibeat Telugu
వెబ్ సిరీస్‌ల మాటేమిటీ

వెబ్ సిరీస్‌ల మాటేమిటీ

అయితే ఈ నిబంధన సినిమా, టెలివిజన్ రంగాలకే పరిమితమైతే వివాదంగా మారే అవకాశం ఉంది. అయితే వెబ్ సిరీస్‌ నిర్మాణాలకు ఈ నిబంధనలు వర్తిస్తాయా అనే ప్రశ్నను కొందరు లేవనెత్తుతున్నారు. లిప్‌లాక్స్, రొమాంటిక్ సీన్లు సినిమా, టెలివిజన్‌లో కంటే వెబ్ సిరీస్‌లలో, ఇండిపెండెంట్ సినిమాల్లోనే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే కేంద్రం ఆలోచనా విధానం ఎలా ఉందనేది కొద్దిరోజుల్లో తెలుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X