»   » వాటిని వాడను, కూతురుపై ఐశ్వర్యరాయ్ జాగ్రత్తలు

వాటిని వాడను, కూతురుపై ఐశ్వర్యరాయ్ జాగ్రత్తలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ప్రముఖ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ సౌందర్య సాధనాలు తయారు చేసే పలు కార్పొరెట్ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్య్యూలో ఐశ్వర్యరాయ్ మాట్లాడుతూ....తన కూతురు ఆరాధ్య మేకప్ నిమిత్తం సదరు కాస్మొటిక్ ఉత్పతులను వాడను అంటోంది.

మీరు ప్రపంచ ప్రఖ్యాత కాస్మొటిక్ బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారుగా....మీ కూతురు మేకప్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అనే ప్రశ్నకు ఐశ్వర్యరాయ్ స్పందిస్తూ....'నేను ప్రపంచ ప్రఖ్యాత కాస్మొటిక్ బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉంది. కానీ నా కూతురు చాలా చిన్న పిల్ల. రెండేళ్ల వయసులోనే కాస్పొటిక్ ఉత్పత్తులు వాడాల్సిన అవసరం లేదు' అని ఐశ్వర్యరాయ్ సమాధానం ఇచ్చింది.

ప్రపంచ ప్రఖ్యాత కాస్మొటిక్ సంస్థ ఎల్ ఓరియల్ సంస్థకు ఐశ్వర్యరాయ్ గత దశాబ్దకాలంగా బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గతంలో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న ఐశ్వర్యరాయ్ ప్రచారం చేయడం వల్ల ఆ సంస్థ ఉత్పత్తుల అమ్మకాలు ఇండియాతో పాటు ఇతర దేశాల్లోనూ బాగా పెరిగాయి.

ఆ విషయాలు పక్కన పెడితే...బిడ్డ పుట్టినప్పటి నుండి సినిమాలకు దూరంగా ఉంటున్న ఐశ్వర్యరాయ్ త్వరలో మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వనుందనే వార్తలు జోరుగా ప్రచారం సాగుతున్నాయి. గత సంవత్సరమంతా ఇలాంటి వార్తలతోనే గడిచిపోయిందే తప్ప ఐశ్వర్య మాత్రం ఇంకా రీ ఎంట్రీ ఇవ్వలేదు. మరీ ఈ సంవత్సరమైనా ఐశ్వర్యరాయ్ అందాలను మళ్లీ తెరపై చూసే భాగ్యం దక్కుతుందో? లేదో?

English summary
Aishwarya Rai Bachchan said at a recent event that though she is a brand ambassador of a prestigious cosmetic brand, she definitely will not encourage her two-year-old daughter to take up a fancy to makeup.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu