»   » నాన్న, కుక్క తప్ప ఏ మగాడు నా జీవితంలో లేడు

నాన్న, కుక్క తప్ప ఏ మగాడు నా జీవితంలో లేడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇండియన్ సినిమాల్లో హీరోయిన్ గా రాణిస్తున్న బ్రిటిష్ బ్యూటీ అమీ జాక్సన్ గురించి కొన్ని రోజులుగా మీడియాలో ఓ రూమర్ చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. జీన్ బెర్నార్డ్ ఫెర్నాండెజ్ తో ఆమె కలిసి కనిపించడంతో అతడితో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు గుప్పుమన్నాయి.

ఇద్దరూ కలిసి తిరుగుతున్నారని చాలా కాలంగా ప్రచారం ఉంది. అయితే ఇటీవల అమీ జాక్సన్ అతనితో కలిసి లండన్ లో ఓ ఫ్రెంచ్ రెస్టారెంట్ వద్ద కనిపించడంతో ఇతడే ఆమె కొత్త బాయ్ ఫ్రెండ్ అంటూ మీడియాలో ప్రచారం మొదలైంది.

అయితే ఈ వార్తలపై అమీ జాక్సన్ సీరియస్ గా స్పందించింది. 'తన జీవితంలో తండ్రి, తాను పెంచుకుంటున్న పాబ్లో(కుక్క) తప్ప మరో మగాడు లేడని స్పష్టం చేసింది. ఇలాంటి లింకులు పెట్టి వార్తలు రాయడం సిల్లీ గా ఉంది' అంటూ ట్వీట్‌ చేసింది.

అమీ జాక్సన్ గతంలో బాలీవుడ్ నటుడు ప్రతీక్ బబ్బర్ తో ప్రేయామణం సాగించిందని అప్పట్లో బాలీవుడ్ కోడై కూసింది. తర్వాత ఇద్దరూ విడిపోయారు. కొంతకాలం బ్రిటీష్ బాక్సర్ ఓ సెల్ కిర్క్ తో డేటింగ్ స్టార్ట్ చేసిందని, తర్వాత కారోనేషన్ స్ట్రీట్ యాక్టర్ రియాన్ థామస్ తో కూడా డేటింగ్ చేసినట్టు ప్రచారం జరిగింది. ఇపుడేమో బెర్నార్డ్ అంటూ ప్రచారం మొదలైంది.

అమీ జాక్సన్ మీద ఇలాంటి రూమర్స్ సర్వసాధారణమే. గతంలో ఎప్పుడూ అమీ ఇంత ఘాటుగా స్పందించలేదు. ఎందుకో జీన్ బెర్నార్డ్ ఫెర్నాండెజ్ తో తనకు లింకు పెట్టగానే తట్టుకోలేక పోయింది. ఆ సంగతి పక్కన పెడితే....ప్రస్తుతం అమీ జాక్సన్ రజనీ కాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం రోబో 2 లో హీరోయిన్ గా నటిస్తోంది.

No men in my life except my Dad and my doggy: Amy Jackson

జీన్ బెర్నార్డ్ ఫెర్నాండెజ్ తో డేటింగ్ వార్తలపై అమీ జాక్సన్ సీరియస్ గా స్పందించింది. 'తన జీవితంలో తండ్రి, తాను పెంచుకుంటున్న పాబ్లో(కుక్క) తప్ప మరో మగాడు లేడని స్పష్టం చేసింది. ఇలాంటి లింకులు పెట్టి వార్తలు రాయడం సిల్లీ గా ఉంది' అంటూ ట్వీట్‌ చేసింది.

English summary
"I'd just like to clarify that there are absolutely no men in my life except my Dad and my doggy Pablo. These linkups are getting silly now" Amy Jackson tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu