»   »  విషయం లీక్ చేసి ఇబ్బందుల్లో పడ్డ సమంత!

విషయం లీక్ చేసి ఇబ్బందుల్లో పడ్డ సమంత!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: హీరోయిన్ సమంత ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తాను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నానని, త్వరలోనే పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అవ్వాలని, ఉందని, పిల్లలు అంటే నాకు ఎంతో ఇష్టం, పిల్లలను కనాలని ఉందని చెప్పిన సంగతి తెలిసిందే.

No more talk of marriage until I say: Samantha

అయితే సమంత తన ప్రయుడు ఎవరు? అనే విషయం మాత్రం బయట పెట్టలేదు. సమంత నోటి నుండి పెళ్లి విషయం వచ్చినప్పటి నుండి మీడియాలో ఈ విషయం హాట్ టాపిక్ అయింది. అభిమానులు కూడా ఆమెను ట్విట్టర్లో పెళ్లి గురించిన ప్రశ్నలు, మీ బాయ్ ఫ్రెండ్ ఎవరు? అనే ప్రశ్నలతో విసిగిస్తున్నారు.

Also Read: త్వరలో పెళ్లి: తన ప్రియుడి గురించి చెప్పిన సమంత!

తన పెళ్లి గురించి సోషల్ మీడియా ద్వారా ప్రశ్నలు వెల్లువెత్తుతుండటంతో సమంత తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా స్పందించారు. తాను చెప్పే వరకు పెళ్లి మాట ఎత్తొద్దని అభిమానులను, మీడియాను కోరుతూ... ట్వీట్‌ చేశారు. సమంత స్పందన చూస్తుంటే... ఇటీవల ఇంటర్వ్యూలో ప్రియుడి గురించి, పెళ్లి గురించి అనవసరంగా మాట్లాడానని ఫీలవుతున్నట్లు స్పష్టమవుతోంది. సమంత స్వయంగా తన ప్రేమ విషయాన్ని లీక్ చేసి ఇపుడు ఇలా ఇబ్బందుల్లో పడింది.

ప్రస్తుతం సమంత త్రివిక్రమ్‌ దర్శకత్వంలో 'అ..ఆ'-అనసూయ రామలింగం వర్సెస్‌ ఆనంద్‌ విహారి అనే చిత్రంలో నటిస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్‌ 2న విడుదలకు సిద్దమవుతోంది. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. మిక్కీ జె. మేయర్‌ సంగీతం సమకూర్చారు.

Read more about: samantha, సమంత
English summary
"No more talk of marriage until I say so ... I I I I ME ME ME ME aka SAMANTHA says so . Thankyou" Samantha tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu