అక్కడ టాట్టూలేంటి అసహ్యంగా!
ప్రైవేట్ పార్ట్స్ మీద టాట్టూలు వేయించుకోవడం తనకు అస్సలు నచ్చదని అంటోంది కోలీవుడ్ నుండి బాలీవుడ్ కి వెళ్ళి, అక్కడే సెటిలైపోయిన అసిన్, భుజంమీద, వీపు వెనుక భాగంలోనూ టాట్టూలు వేసుకుంటే పెద్దగా ఇబ్బంది వుండదుగానీ, అమ్మాయిలు ఎదపైనా, బొడ్డుపైనా టాట్టూల మీద ఇంట్రెస్ట్ పెంచుకోవడం తనకు ఏమాత్రం ఇష్టపడదని చెప్పుకొచ్చింది అసిన్ ఓ ఇంటర్వ్యూలో.
ఇదంతా, అసిన్ తనకు బాలీవుడ్ లో పోటీగా రాబోతోన్న త్రిష గురించేనని అప్పుడే బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. త్రిష ఎద బాగంపై టాట్టూ చాలాకాలంగా దర్శనమిస్తోన్న సంగతి విదితమే.టాట్టూతో పాటుగా ఎదభాగాన్ని ప్రదర్శించడం గత కొద్ది కాలంగా ఎక్కువ చేసింది త్రిష. ఆ కారణంగానే ఆమె మరింత గ్లామరస్ గా కన్సిస్తోందనేవారూ లేకపోలేదు. ఇక టాట్టూలపై ఖచ్చితమైన అభిప్రాయాన్ని చెబుతోన్న అసిన్, కళాత్మక సినిమాలోస్తే, అందులో తప్పనిసరైతే, వల్గర్ గా లేకుండా వుండేందుకు బాడీ పెయింట్ వేసుకుంటానాని చెబుతుండడం గమనార్హం.


Click it and Unblock the Notifications











