twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గాయని ఎస్. జానకి వ్యాఖ్యలపై కేంద్రం స్పందన

    By Srikanya
    |

    తిరునల్వేలి : పద్మ అవార్డులలో వివక్షత జరుగుతోందనే విమర్శలపై ప్రభుత్వం స్పందించింది. పద్మ అవార్డుల ఎంపికలో దక్షిణాది కళాకారులను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ప్రముఖ గాయని ఎస్.జానకి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. అవార్డు గ్రహీతల ఎంపికలో ఏ రాష్ట్రంపట్ల కూడా వివక్ష చూపడం లేదని తెలిపింది. కేంద్ర మంత్రి వి.నారాయణ స్వామి మీడియాతో మాట్లాడుతూ, జానకి వ్యాఖ్యలను తోసిపుచ్చారు. దక్షిణాది వారిని పట్టించుకోకుండా ఉత్తరాది కళాకారులకే పట్టం కడుతున్నందున తనకు ప్రకటించిన పద్మభూషణ్ అవార్డును తిరస్కరిస్తున్నట్లు జానకి చెప్పిన విషయం తెలిసిందే. 'అవార్డు గ్రహీతల ఎంపిక ప్రక్రియలో ఏ రాష్ట్రంపైనా పక్షపాతం చూపడం లేదు. దక్షిణాది వారిని నిర్లక్ష్యం చేస్తున్నామనడం సబబుకాదు' అని నారాయణ స్వామి పేర్కొన్నారు.

    'వివిధ అవార్డుల కోసం వచ్చే దరఖాస్తులను నిపుణుల కమిటీ పరిశీలించి, కొన్ని పేర్లను ఎంపికచేసి ఆ జాబితాను కేబినెట్ కార్యదర్శికి పంపుతుంది. అనంతరం గ్రహీతల పేర్లను ప్రధానమంత్రి, రాష్ట్రపతి నిర్ణయిస్తారు' అని ఆయన చెప్పారు. అందువల్ల జానకి అవార్డును స్వీకరించాలని కోరారు. ఇదిలా ఉండగా, కమల్‌హాసన్ నటించిన 'విశ్వరూపం' చిత్రంపై ముస్లింలు నిరసన వ్యక్తంచేస్తుండటం గురించి మాట్లాడుతూ, సమస్య పరిష్కారం కోసం ఇరు వర్గాలు కూర్చొని మాట్లాడుకోవాలని సూచించారు.

    పదులవేల సంఖ్యలో పాటలు పాడిన మధుర గాయని ఎస్ జానకికి 'పద్మ భూషణ్' పురస్కారం ప్రకటించగా, ఆమె దాన్ని తిరస్కరించారు. జాతీయ స్థాయి పురస్కారాల ప్రకటనలో దక్షిణ భారతదేశాన్ని అలక్ష్యం చేస్తున్నందుకు నిరసనగా తానీ పురస్కారాన్ని తిరస్కరిస్తున్నట్లు జానకి ప్రకటించడం విశేషం. నాలుగు సార్లు జాతీయ స్థాయిలోనూ, 31 సార్లు విభిన్న రాష్ట్రాల స్థాయులలోనూ ఉత్తమ గాయనిగా పురస్కారం అందుకున్నారు.

    ఎస్. జానకి మీడియాతో స్పందిస్తూ ఇన్నేళ్ల తర్వాత ఈ అవార్డు వచ్చి ఏం లాభం, ఇంత లేటుగా నన్ను గుర్తించినందుకు బాధగా ఉంది...తనకు ఏం మాత్రం సంతృప్తి లేదని, పద్మ భూషణ్ కంటే పెద్ద అవార్డు ఆశించాను, ఉత్తరాది వారి మాదిరి దక్షిణాది వారికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆమె అన్నారు. భారత రత్న అవార్డు తప్ప అంతకు తక్కువ స్థాయి అవార్డు తనకు అక్కర లేదని ఆమె మీడియా వద్ద ఘాటుగా స్పందించారు. తనకు ఈ అవార్డు కంటే గొప్ప స్థానం అభిమానుల గుండెల్లోనే ఉందని, అది చాలన్నారు.

    జానకి. తెలుగు, కన్నడం, మలయాళం, తమిళం, హిందీ తదితర భాషల్లో విస్తృతంగా గానం చేసిన జానకి ఇళయ రాజా సంగీత దర్శకత్వంలో పాడిన కొన్ని అద్భుత గీతాలు ఆమె ప్రతిభకు అద్దంపడతాయి. కలైమామణి, గౌరవ డాక్టరేట్ పట్టాలాంటి పురస్కారాలు సైతం ఆమెని వరించాయి. కానీ, 74 సంవత్సరాల జానకికి ఇంతవరకూ ఒక్క పద్మ పురస్కారం కూడా రాలేదు.

    English summary
    Government rejected noted playback singer S Janaki's claim that artistes from south were generally neglected in Padma awards. "There is no bias towards any state in selecting the awardees. But she had stated she was not interested in receiving the award because south Indians were neglected. It is not so. There is no question of south Indians being neglected," Minister of State in the PMO V Narayanaswamy said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X