నిఖిషా పటేల్ కెరీర్ కి 'పులి' చిత్రమే క్లైమాక్స్ !?

By Srikanya

పులి చిత్రంతో పరిచయమైన నిఖిషా పటేల్ ఆ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకుంది. అయితే రిలీజైన మొదటి రోజే సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకోవటంతో ఆమె ఆశలన్నీ కల్లలు అయ్యాయి. విడుదలకు ముందు ఆమెకు ఆఫర్స్ బాగా వచ్చినా రిలీజైతే మంచి రెమ్యునేషన్ తో లైఫ్ సెటిల్ చేసుకోవచ్చని ఆగిందని సమాచారం. అయితే సినిమా రిలీజయ్యాక ఎవరూ ఆమె జోలికి వెళ్ళటం లేదు. అయితే తనకు చాలా ఆఫర్స్ వస్తున్నాయని, ఆచి తూచి అడుగేద్దామని వెయిట్ చేస్తున్నానని చెప్తోంది. ఇక వరుడు సరసన చేసిన భానుశ్రీ మోహ్రా లా ఈమెకు కూడా కెరీర్ కిదే క్లైమాక్స్ అని కొందరంటున్నారు.కాదు..చిరుత సినిమాలో చేసిన నేహాశర్మ లా మరో ఆఫర్ ఎప్పటికో అప్పటికి వస్తుందని మరికొందరంటున్నారు. చిన్న సినిమా వాళ్ళు ఆమెను పెద్ద హీరోయిన్ లిస్టులో వేసి రెమ్యునేషన్ కి భయపడి అడగరు. పెద్ద హీరోల సినిమా వాళ్లు...పులి హిట్..ప్లాప్ అని చూసుకుంటారు.దాంతో ఆమె అటు ఇటు కాని స్ధితిలో ఉందంటున్నారు. ఇక శ్రీ సినిమాతో పరిచయమైన తమన్నా..తర్వత ఎప్పుడో వచ్చిన హ్యాపీడేస్ తో పూర్తి బిజీ అయ్యింది. అలా మరో దర్శుకుడు ఎవరో పుణ్యం కట్టుకుంటే గానీ ఆమె కెరీర్ గాడిన పడదు.అప్పటివరకూ ఆమె కెరీర్..శంకర్ దాదా జిందాబాద్ హీరోయిన్ కరిష్మా కొటక్ లా మిగలాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X