ప్రభాస్‌తోపాటు రష్మి ఫోటో.. అడక్కుండానే వేయడంపై భగ్గుమన్న యాంకర్!

By Bojja Kumar

Recommended Video

Rashmi Gautam Reports On Event Organisers

అమెరికాలో ఉండే తెలుగు సంఘాలు నిర్వహించుకునే కార్యక్రమాలకు మన సినీతారలు అతిథులుగా హాజరవ్వడం, అక్కడుంటే తెలుగు వారిని తమ ఆట పాటలతో ఎంటర్టెన్ చేయడం లాంటి ఈవెంట్లు తరచూ జరగడం చూస్తేనే ఉన్నాం. త్వరలో 'నాటా' (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) ఆధ్వర్యంలో పెన్సిల్వేనియా రాష్ట్రంలోని ఫిలడెల్ఫియా సిటీలో మరో భారీ ఈవెంట్ జరుగబోతోంది. జులై 6 నుండి జులై 8 వరకు జరిగే ఈవెంట్ కోసం ఇప్పటి నుండే ప్రచారం మొదలు పెట్టారు. ప్రభాస్, రష్మి, శ్రీను వైట్లతో పాటు చాలా మంది స్టార్స్ హాజరవుతున్నటు నిర్వాహకులు ప్రకటించారు. దీనిపై యాంకర్ రష్మి భగ్గుమన్నారు.

నా అనుమతి తీకోలేదంటున్న రష్మి

నా అనుమతి తీకోలేదంటున్న రష్మి

తన అనుమతి లేకుండా, కనీసం తనను సంప్రదించకుండా తాను ‘నాటా' ఆధ్వర్యంలో జరిగే ఈవెంటుకు తాను హాజరవుతున్నట్లు ప్రచారం చేయడంపై యాంకర్ రష్మి మండి పడ్డారు. ట్విట్టర్ ద్వారా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

 తప్పుతోవ పట్టించవద్దు

తప్పుతోవ పట్టించవద్దు

తాము రాక పోయినా వస్తున్నట్లు ప్రచారం చేసి ఈవెంటుకు హాజరయ్యే వారిని తప్పతోవ పట్టించవద్దు. ఈ మధ్య కాలంలో కొన్ని ఈవెంట్ ఆర్గనైజేషన్లు తరచూ చర్యలకు పాల్పడుతున్నారు. ఇది మంచి పద్దతి కాదు అని రష్మి గౌతమ్ తెలిపారు.

నాటా కమిటీకి ఫిర్యాదు చేసిన రష్మి

నాటా కమిటీకి ఫిర్యాదు చేసిన రష్మి

ఈవెంట్ ఆర్గనైజర్లు చేస్తున్న ఈ తప్పుడు ప్రచారంపై ‘నాటా' పెద్దలకు తెలిసేలా ఆమె ట్వీట్ చేశారు. తమ ఫోటోలు వాడే ముందు అఫీషియల్ కన్ఫర్మేషన్ లెటర్స్ తీసుకోవాలని రష్మి ఈ సందర్భంగా సూచించారు.

ప్రభాస్ కూడా వస్తున్నట్లు ప్రచారం

ప్రభాస్ కూడా వస్తున్నట్లు ప్రచారం

‘నాటా' తెలుగు ఈవెంట్ ఆర్గనైజర్లు ప్రభాస్ కూడా వస్తున్నట్లు కూడా ప్రకటించారు. అయితే తాజాగా రష్మి చేసిన ట్వీట్ తో ఈవెంట్ ఆర్గనైజర్ల నిజాయితీ మీద అనేక అనుమానాలు మొదలయ్యాయి. కనీసం ప్రభాస్ నుండైనా అనుమతి తీసుకున్నారా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X