రిలీజుకు ముందు అంతా ఇదేం సినిమా అని నవ్వారు
ఇప్పుడు హిట్టయింది కాబట్టి అందరూ పొగిడేస్తున్నారు. అదే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు, పూర్తయ్యాక అందరూ విమర్శించినవాళ్లే...నవ్వినవాళ్ళే అంటున్నాడు సల్మాన్ ఖాన్. 2010 లో విడుదలైన తన సూపర్ హిట్ దబాంగ్ చిత్రం గురించి మాట్లాడుతూ ఇలా స్పదించారు. అలాగే సినిమా బ్యాక్ గ్రౌండ్ పల్లెటూరుట..హీరోకీ, డైరక్టర్ కీ బుర్రలేదు..వాళ్ళకి వ్యాపార సూత్రాలు తెలియవు అంటూ నవ్వారు. అంతెందుకు ఓ దశలో సినిమాని కొనేందుకు ఎవరూ రాలేదు. ఇప్పుడు ప్రేక్షకులు ఆదరించి సూపర్ హిట్టయ్యాక మాత్రం అదే పనిగా పొగుడుతున్నారు. విమర్శల్నీ, పొగడ్తల్నీ పట్టించుకోవడం అంటే మన టైమ్ ని మనమే చేతులారా వృథా చేసుకోవడమే అని అన్నారు సల్మాన్. ఇక ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు అనీఫియల్ గా మహేష్ తాజా చిత్రం దబాంగ్ లో చోటు చేసుకోనున్నాయని వినపడుతోంది.


Click it and Unblock the Notifications











