twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా కూతురు పై సినమా తీస్తే చర్యలు తప్పవు..!

    By Sindhu
    |

    రాణీ ముఖర్జీ, విద్యా బాలన్ నటించి బాలీవుడ్ లో హిట్ అయిన 'నో వన్ కిల్డ్ జెస్పికా" సూపర్ హిట్ అయిన చిత్రాన్ని ఆదర్శంగా తీసుకుని టాలీవుడ్ హీరోయిన్ ప్రత్యూష మరణాన్ని 'నో వన్ కిల్డ్ ప్రత్యూష" అనే చిత్రంగా తెరకెక్కించడానికి ప్లాన్ చేసారు. అయితే అది ఒకవేళ తెలుగు సినిమా హీరోయిన్ సామల ప్రత్యూషకు సంబంధించినదే అయితే దానిని ప్రత్యూష తల్లిగా అభ్యంతరం తెలియజేస్తున్నానని సరోజినీ దేవి అన్నారు.

    'నా కుమార్తె అన్యాయంగా చనిపోయి పదేళ్లవుతోంది, అప్పటి నుంచి న్యాయపోరాటం చేస్తున్నాను. ప్రత్యూష కేసు కూడా హైకోర్టులో ఉంది. జడ్జిమెంటుకోసం ఎదురు చూస్తున్నాను. కనీసం ఇప్పుడైనా న్యాయదేవత నాకు నా కుటుంబానికి న్యాయం అందించి ప్రత్యూష ఆత్మకు శాంతి కలుగజేస్తుందని ఆశిస్తున్నాను. ఇలాంటి సమయంలో ఇలాంటి అభ్యంతరకరమైన టైటిల్స్ పెట్టి నా కుమార్తె పేరున సినిమా తీయడం చాలా అన్యాయం. జడ్జిమెంట్ ఏంటో తెలుసుకోకుండా, కోర్టు తీర్పు వెలువడకుండా ఇలాంటి సినిమా తీస్తే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అవుతుంది.

    ఇలాంటి సినిమా తీసే ఉద్దేశ్యం ఉన్నవారికి ఇది తెలియజేయడం జరుగుతుంది. ఒకవేళ ఇలాంటి సినిమా తీస్తే చట్టపరంగా ఎలాంటి పోరాటానికైనా సిద్ధం. అన్యాయమైన నా కూతురికి ఏమీ చేయలేకపోయినా కనీసం సానుభూతి చూపండి. అంతేగానీ వివాస్పద చిత్రాలు తీయవద్దని కోరుకుంటున్నా" అని అని ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేసింది. మరి ప్రత్యూష తల్లి ఆవేదన చూసైనా..చావుల్తో సొమ్ము చేసుకోవాలని చూసే దర్శకనిర్మాతలు మారతారేమో చూద్దాం.

    English summary
    Based on the murder of model Jessica Lall (1999) in an uptown eatery in Delhi and her sister, Sabrina Lall's fight for justice, the film showcases contemporary India as it is. The latest buzz in tollywood is making a movie on Heroin Prathyusha.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X