ఆమె సినిమాలు ఆపమంటూ కంప్లైంట్..వివాదం

ఎన్నికల్లో పోటీ చేస్తోన్న అభ్యర్థి నటించిన చిత్రం ఎన్నికల నియమావళి అమలులో ఉన్నప్పుడు విడుదల కావటం సరికాదని పేర్కొన్నారు. అర్జీను ఎన్నికల కమిషన్ విచారణకు స్వీకరించింది. ఈ అంశమై కేంద్ర ఎన్నికల సంఘం అధికార్లతో మాట్లాడటంతో పాటు చిత్రం విడుదలకు సంబంధించిన సమాచారాన్ని తెప్పించుకుంటానని ఎన్నికల సంఘం అధికారి అనిల్‌కుమార్ ఝా తెలిపారు.
అయితే మరో ప్రక్క ఆమె నిర్మాతలు ఇప్పటికే తాము ప్రత్యేక పర్మిషన్ తెచ్చుకున్నామని చెప్తున్నారు. అయినా రాజకీయాలకు తమ సినిమాలు బలిచేయటం న్యాయం కాదని అంటున్నారు. సినిమా ఆపుచేస్తే వారు కోర్టుకు వెళ్లటానికి రెడిగా ఉన్నట్లు సమాచారం. ఈ వివాదం ఎక్కడికి వెళ్లి ఆగుతుందోనని అంతా ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications











