అవన్నీ రూమర్స్...రాజమౌళి
మగధీర చిత్రం పై వినపడుతున్న బయిట వస్తున్న రకరకాల రూమర్స్ ను ఖండిస్తూ దర్శకుడు రాజమౌళి క్లారిటీగా సమాధానం ఇచ్చారు. ఈ రోజు(శుక్రవారం)ప్రసాద్ ల్యాబ్ లో మగధీరకు స్పెషల్ ఎఫెక్టులు, సి.జి వర్క్ అందించిన EFX వారు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడారు. బయిట మగధీరను హిందీలోకి రీమేక్ చేస్తున్నారని, సీక్వెల్ తీస్తున్నారని వినపడుతోంది. దానికి మీరేమంటారు అన్న దానికి సమాధానంగా రాజమౌళి అవన్నీ రూమర్స్ అని కొట్టి పాడేసారు. నేను స్పష్టంగా చెప్తున్నాను.నిర్మాత అల్లు అరవింద్ నన్ను హిందీ రీమేక్ చేయమని అడిగిన మాట వాస్తవం. కానీ నేను ఒప్పుకోలేదు. కాబట్టి ఆ ఆలోచన లేదు. అలాగే దీనికి సీక్వెల్ తీసే ప్రసక్తి లేదు..ఎందుకంటే ఆ స్కోప్ ఈ కథలో లేదని చెప్పారు. ఆ ప్రెస్ మీట్ లో ప్రసాద్ ల్యాబ్స్ రమేష్ ప్రసాద్, EFX ప్రతినిధి సాయి ప్రసాద్, స్పెషల్ ఎఫెక్ట్స్ డైరక్టర్ కమల్ కన్నన్ పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











