twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ చరణ్ కి ఉపాసన ఆ కండీషన్ పెట్టిందా?

    By Srikanya
    |

    రామ్ చరణ్ కాబోయే భార్య ఉపాసన అతనికి ఒకే ఒక కండిషన్ పెట్టిందని చెప్పుకుంటున్నారు. అది మరేది కాదు అతను పాలిటిక్స్ లోకి రాకూడదని. రామ్ చరణ్ తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ సినీ రంగంలోకి వచ్చినట్లే భవిష్యత్తులోనూ రాజకీయరంగంలోకి వస్తాడని ఆమె భావించే ఈ కండిషన్ పెట్టిందని చెప్పుకుంటున్నారు. అయితే రామ్ చరణ్ బిజెనెస్ లోకి రావాలని ఆమె ఆశపడుతోందని చెప్తున్నారు. దానకి రామ్ చరణ్ కూడా ఓటేశాడని, ఈ విషయం ఆమె సన్నిహితుల వద్ద ప్రస్దావించిందని టాక్ వినపడుతోంది.ఇక రామ్ చరణ్ తన పెళ్ళి విషయమై మాట్లాడుతూ.. రైట్ ఏజ్ లో పెళ్లి చేసుకుంటున్నామా లేదా అనేది కాదు...రైట్ పర్శన్ ని చేసుకుంటున్నామా అనేది ఆలోచించుకోవాలి అన్నారు రామ్ చరణ్.

    మీరు త్వరగా పెళ్ళి చేసుకుంటున్నానని భావిస్తున్నారా అని మీడియా వారు ప్రశ్నిస్తే ఆయన ఇలా స్పందించారు. అలాగే కెరీర్ లో సెటిల్ కాని వారు పెళ్లి గురించి ఆలోచించరు. కానీ నేను రాబోయే ఇరవై ఏళ్ళ వరకూ నా కెరీర్ బావుంటుందనే భాటవిస్తున్నాను.ప్రస్తుతం నేను చాలా ఫోకస్ గా ఉన్నాను. ఇదే నా జీవితంలో నేను వివాహం చేసుకోవటానికి సరైన సమయం అని భావిస్తన్నాను అన్నాడు. పూర్తిస్థాయి యాక్షన్ చిత్రంగా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంకోసం రామ్ చరణ్ మియామి, అమెరికలో మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. తమన్నా రామ్ చరణ్ తో జోడికడుతున్న ఈ సినిమాలో చరణ్ మిడిల్ క్లాస్ కుర్రాడుగా పక్కా మాస్ పాత్రను చేస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ 'రచ్చ'సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని ప్రతిస్టాత్మకంగా నిర్మిస్తుంది.

    English summary
    "Upasana is listing out the regulations to Cherry before they enter into marital life. She has only one condition- Cherry should not enter into politics.”
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X