'ఊసరవిల్లి'కి మొదలెట్టకపోతే కష్టం అంటున్నారు
ఎన్టీఆర్ తాజా చిత్రం ఊసరవిల్లి విడుదల తేదీ దగ్గరపడుతున్నా ఎక్కడా ప్రమోషన్ ప్రారంభం కాలేదు. యూనిట్ అంతా షూటింగ్ లో బిజీగా ఉంది. మరో ప్రక్క చిత్రం ఆడియో కూడా విడుదల కాలేదు. ఆడియో విడుదల అయితే మార్కెట్లో క్రేజ్ మొదలయ్యేది. కాని ఆడియో విడుదల తేదీకి సినిమా విడుదల తేదీకి పెద్ద గ్యాప్ లేకపోవటంతో ఆ అవకాశం కూడా కనపడటం లేదు.ఈ విషయంలో దూకుడు చిత్రం దూకుడుగా ఉందనే చెప్పాలి. దాంతో ఎన్టీఆర్ అభిమానులలో టెన్షన్ మొదలైంది.ఈ నెల రెండో వారంలో ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదల చేస్తున్నారప. దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన బాణీలిచ్చారు. అక్టోబర్ 6న విజయదశమి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఆర్.ఆర్. ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ సరసన తమన్నా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్, కిక్ శ్యామ్, తనికెళ్ల భరణి, ఆద్విక్ మహాజన్, మురళీశర్మ, ఆహుతి ప్రసాద్, రెహమాన్, జయప్రకాశ్‌రెడ్డి, రఘుబాబు, అజయ్, ఎమ్మెస్ నారాయణ, పాయల్ ఘోష్, దువ్వాసి మోహన్, రఘు కారుమంచి, జీవీ, విద్యుత్ జమ్వాల్, బెనర్జీ తారాగణమైన ఈ చిత్రానికి కథ: వక్కంతం వంశీ, మాటలు: కొరటాల శివ, పాటలు: రామజోగయ్యశాస్త్రి, అనంత శ్రీరామ్, చంద్రబోస్, సినిమాటోగ్రఫీ: రసూల్ ఎల్లోర్, యాక్షన్: రామ్-లక్ష్మణ్, కళ: రవీందర్, లైన్ ప్రొడ్యూసర్: చక్రవర్తి రామచంద్ర, సమర్పణ: బి. బాపినీడు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సురేందర్ రెడ్డి.


Click it and Unblock the Notifications











