మూల కారణం పవన్ కళ్యాణే... అందుకే ఈ రూమర్లు!
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘గబ్బర్ సింగ్' చిత్రం భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘గబ్బర్ సింగ్-2' రాబోతోందనే ప్రకటన రాగానే అభిమానుల్లో ఏదో ఆనందం. అయితే ఆనందం వారికి ఎంతో కాలం నిలవలేదు. కారణం సినిమా ఇప్పటికీ మొదలు కాక పోవడం, అసలు సినిమాకు సంబంధించి ఎలాంటి అపీషియల్ అప్ డేట్స్ లేక పోవడం. సినిమా ప్రకటన వచ్చి ఏళ్లు గడుస్తున్నాయి. అసలు ఈ సినిమా వస్తుందో లేదో తెలియని అయోమయ పరిస్థితి.
‘గబ్బర్ సింగ్ 2' సినిమాపై ఎప్పుడూ ఏదో ఒక రూమర్. వాస్తవానికి ఈ చిత్రం సంపత్ నంది దర్శకత్వంలో మొదలైంది. ఈ చిత్రం నుండి అతను తప్పుకుంటున్నారని కొంతకాలం రూమర్లు చక్కర్లు కొట్టాయి. ఆ తర్వాత ఆ రూమర్లే నిజం అయ్యాయి. ఆ తర్వాత ఈ చిత్రం డైరెక్టర్ బాబీ చేతికి వెళ్లింది.

సాధారణంగా ఏ సినిమా మొదలైనా....దాని గురించి తరచూ ఏదో ఒక అప్ డేట్స్ మీడియా కు ఇస్తుంటారు ప్రొడక్షన్ టీం. కానీ ‘గబ్బర్ సింగ్-2' సినిమా విషయంలో మాత్రం పూర్తిగా భిన్నంగా సాగుతోంది. సినిమాకు సంబంధించిన ఏ విషయాన్ని బయటకు చెప్పకుండా రహస్యంగా ఉంచుతున్నారు. దీంతో పలు రూమర్లు ప్రచారంలోకి వస్తున్నాయి.
ఇలాంటి పరిస్థితులకు మూల కారణం పవన్ కళ్యాణే అని అంటున్నారు. సినిమా త్వరగా పూర్తి చేయాలనే ఆలోచన ఆయనకు అసలు లేదని టాక్. డైరెక్టర్ బాబీ తన పని పూర్తి చేసి షూటింగుకు అన్నీ సిద్దం చేసినా పవన్ కళ్యాణ్ నుండి ఎలాంటి స్పందన లేదట. డైరెక్టర్ ఫోన్ చేసినా అసలు సమాధానం ఇవ్వడం లేదట. దీంతో రకరకాల రూమర్లు ప్రచారంలోకి వచ్చాయి.


Click it and Unblock the Notifications











