twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎక్స్‌ఫోజింగుతో నిర్మాతలను ట్రాప్ చేసి, హీరోలను పట్టేస్తుందా?.. నాగబాబు ఫైర్

    |

    ఈ మధ్య కాలంలో మహిళల వస్త్రాధారణ సరిగా ఉండటం లేదని, ఫ్యాషన్ పేరుతో పబ్లిక్ ఫంక్షన్లలో కూడా హీరోయిన్లు ఎక్స్‌ఫోజింగ్ చేయడాన్ని తప్పుబడుతూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, గరికపాటి లాంటి ప్రముఖులు వ్యాఖ్యలు చేయడాన్ని నాగబాబు వ్యతిరేకించిన సంగతి తెలిసిందే.

    తాజాగా ఓ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగబాబుకు ఈ టాపిక్‌పై కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. ఆడవాళ్ల బట్టల గురించి బాలసుబ్రహ్మణ్యం గారు చేసిన కామెంట్లలో మీకు తప్పేమనిపించింది? అంత ఘాటుగా రియాక్ట్ అవ్వాల్సిన పనేమిటి? అని ప్రశ్నించగా నాగబాబు మరోసారి అదే స్థాయిలో రియాక్ట్ అయ్యారు.

    ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారు ఒక్కరే కాదు, మురళీ మెహన్ గారు చేశారు, గరికపాటి నరసింహారావుగారు కూడా ఇలాంటి కామెంట్స్ చేశారు, జేసుదాసు గారు గతంలో ఇలా మాట్లాడితే ఆయనపై కేసు పడిందని నాగబాబు గుర్తు చేశారు.

    ఎక్స్‌ఫోజింగుతో నిర్మాతలను ట్రాప్ చేసి, హీరోలను పట్టేస్తుందా?.

    ఎక్స్‌ఫోజింగుతో నిర్మాతలను ట్రాప్ చేసి, హీరోలను పట్టేస్తుందా?.

    ఒక స్త్రీని నువ్వు సమానంగా చూడలేకపోగా, సమానంగా గౌరవించకపోగా ఇలాంటి అవమానకర మాటలు మాట్లాడకూడదు. నువ్వు అలాంటి డ్రెస్సు వేసుకోకూడదు అనడం ఏమిటి? ఒక హీరోయిన్ కాస్త స్టైలిష్‌గానో, కొంచెం ఎక్స్ ఫోజ్ చేసుకుంటూ బట్టలేసుకొచ్చినంత మాత్రాన... క్యారెక్టర్ కోసం ప్రొడ్యూసర్లను ట్రాప్ చేసేసి, హీరోలను పట్టేస్తుందని అనడమేనా? అంటూ నాగబాబు మండి పడ్డారు.

    అలా అనడానికి వారెవరు?

    అలా అనడానికి వారెవరు?

    అయినా ఆ వ్యక్తుల పేర్లు నేను చెప్పను. ఆడవారంటే అంత చులకన ఎందుకు? బట్టలిప్పుకుని వస్తున్నారా? అసభ్యకరం అని చెప్పడానికి వారెవరు? వారికి ఏం హక్కు ఉంది? వారు ఒక సెలబ్రిటీగా ఆ మాట అంటే... నేను కూడా ఒక సెలబ్రిటీగా వారికి నా ఆన్సర్ ఇస్తున్నాను.

    ఆ హక్కు ఏ మగాడికీ లేదు

    ఆ హక్కు ఏ మగాడికీ లేదు

    ఆడపిల్లలు వేసుకునే డ్రెస్సు మీద కామెంట్స్ చేసే హక్కు ఏ మగాడికి లేదు. ఎందుకంటే మనకు ఒక చట్టం ఉంది. ఆడవారైనా, మగవారైనా బట్టలిప్పుకుని తిరిగితే అది కేసు అవుతుంది. అది తప్పించి ఎవరు ఏ డ్రెస్సు వేసుకున్నా వారి వ్యక్తిగతమైన చాయిస్. వారి ఇష్టం.

    ఆడవారిని గౌరవించలేని దేశం మన భారతదేశం

    ఆడవారిని గౌరవించలేని దేశం మన భారతదేశం

    ఆడవారిని ఏ మాత్రం గౌరవించలేని దేశం మన భారతదేశం. సొల్లు మాత్రం చెబుతారు యత్రనార్యంతు పూజ్యంతే అని. భారత దేశంలో ఏ ఆడదాన్ని ఏ మగాడూ గౌరవించడు. వీలైతే అణగదొక్కాలనిచూస్తారు. సాంప్రదాయాలు సాంప్రదాయాలు అంటున్నారు... వారేమైనా బట్టలిప్పుకుని తిరుగుతున్నారా? మగాళ్లు వేసుకుంటే అసభ్యకరం కాదా?

    అందుకే నేను ఇంతలా రియాక్ట్ అవుతున్నాను

    అందుకే నేను ఇంతలా రియాక్ట్ అవుతున్నాను

    ఈ విషయంలో నేను ఇంతగా రియాక్ట్ అవ్వడానికి కారణం... నేను ఒక తల్లికి కొడుకుని, కొంత మంది చెల్లెళ్లకు అన్నను, ఒక మహిళకు భర్తను, ఒక ఆడపిల్లకు తండ్రిని. ఎంతో మంది పరిచయస్తులు అమ్మలు, చెల్లులు, అక్కలు ఉన్నారు. ఆడైనా, మగైనా సమానంగా గౌరవించాలనేది నా కోరిక అని నాగబాబు చెప్పుకొచ్చారు.

    English summary
    "Singer SP Balasubrahmanyam, TDP MP Murali Mohan and Telugu Avadhani Garikapati Narasimha Rao have no right to comment on women dressing." Naga Babu said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X