For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఇదెక్కడి గొడవ ..!? ఇంతవరకూ బాలయ్య అలా చేయలేదు: మరీ అభిమానులు ఒప్పుకుంటారా....

  |

  నిజానికి ''రైతు'' సినిమాలో బాలయ్య పెద్ద ప్రయోగమే చేయబోతున్నారని అంటున్నారు. గతంలో చాలాసార్లు తన వయస్సును 30 సంవత్సరాల వరకు పెంచుకుని ముసలి గెటప్స్ వేసిన బాలయ్య.. ఆ సినిమాల్లో యంగ్ బాలకృష్ణగా కూడా కనపించేవారు. అలా చేయకపోతే మరి హీరోయిన్లకు రొమాన్స్ కు స్కోప్ ఏముంటుంది. కాని రైతు విషయంలో మాత్రం ఆయన తన పంథాను పూర్తిగా మారుస్తున్నారట. నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ సినిమాల విష‌యంలో సంచ‌ల‌న ప్ర‌యోగాల‌కు ఎప్పుడూ వెనుకాడ‌డు. కొత్త ప్ర‌యోగం చేసే ద‌ర్శ‌కుల‌ను ప్రోత్స‌హించి ఆ పాత్రలో ఒదిగి న్యాయం చేసిన పాత్ర‌లు బాల‌య్య కేరీర్‌లో కోకొల్ల‌లుగా చెప్పొచ్చు.

  ఈ క్ర‌మంలోనే బాల‌య్య‌ ఓ 70 ఏళ్ల ముదుస‌లి పాత్ర‌లో న‌టిస్తూ ... త‌న కెరీర్‌లోనే ఓ విభిన్న ప్ర‌యోగం చేయ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది. బాల‌య్య 101వ సినిమాగా కృష్ణ వంశీ ద‌ర్శ‌క‌త్వంలో రైతు అనే చిత్రంలో న‌టించబోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో 70 ఏళ్ల ముస‌లి వ్య‌క్తిగా బాల‌య్య క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. ఓల్డ్ గెట‌ప్పుల్లో క‌నిపించ‌డం బాల‌య్య‌కు కొత్త కాదు. గ‌తంలో పెద్ద‌న్న‌య్య నుంచి అధినాయ‌కుడు వ‌ర‌కూ ఆ త‌ర‌హా పాత్ర‌ల్లో న‌టించి ప్రేక్ష‌కుల మెప్పు పొందాడు.

  Balakrishna

  అక్కడి వరకే కాదు ఇప్పుడు చెప్పబోయే న్యూస్ వింటే ఇంకా షాక్ తింటారు మరి అదేమిటంటే ఈ సినిమాలో ఒక్కటంటే ఒక్కటి కూడా రొమాంటిక్ సాంగ్ ఉండదని.. ఒకవేళ ఉన్నా కూడా.. బాలయ్యకు మాత్రం ఈ రొమాన్స్ అండ్ సాంగ్స్ ఉండవని అంటున్నారు. పూర్థి స్తాయి సీరియస్ మూడ్ లోనే ఈ పాత్ర ఉంటుందట. అసలు ఆ ఎమోషన్ లో ఉన్న బాలయ్యని చూస్తే అసలు పాతలూ రొమాన్స్ అన్న మాటే గుర్తు రాదనీ ప్రేక్షకులు ఆ రైతు తో పాటే కథలో లీనమైపోతారనీ అంటున్నారు. ముఖ్యంగా ప్రోస్తెటిక్ మేకప్ సహాయంతో బాలయ్య చాలా నేచురల్ గా ఒక నిజజీవితపు రైతులా కనిపిస్తారట. రైతు సమస్యలను ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై తిరగబడే పాత్రలో ఆయన నటించనున్నట్లు టాక్. అంటే కమర్షియల్ మసాలా సినిమా తరహాలో కాకుండా.. ఒక మెసేజ్ ఒరియెంటెడ్ సినిమాను తీస్తున్నారనమాట. బాగానే ఉంది ..

  బాలకృష్ణ 100వ చిత్రంగా 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రం రూపొందుతోంది. భారీ తారాగణంతో .. భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సినిమా, నవంబర్లో షూటింగ్ పూర్తిచేసుకోనుంది. దాంతో తదుపరి చిత్రంగా 'రైతు' చేయాలని బాలకృష్ణ భావిస్తున్నాడని అంటున్నారు. నిజానికి బాలకృష్ణ 100వ చిత్రంగానే 'రైతు' చేయవలసి వుంది. కానీ ఆయన చివరి నిమిషంలో చారిత్రక నేపథ్యం కలిగిన కథకి ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇక 'శాతకర్ణి' పూర్తి కావొస్తుండటంతో, 101వ చిత్రంగా 'రైతు'ను చేయడానికి బాలకృష్ణ రెడీ అవుతున్నాడని చెబుతున్నారు. ఈ సినిమాకి కృష్ణవంశీ దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పూర్తి స్క్రిప్ట్ రెడీ అయినట్టు చెబుతున్నారు. త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ పనులను ఆరంభించే ఆలోచనలో ఉన్నారట. డిసెంబర్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు.

  English summary
  No romance No songs for Balakrishna in Rythu Movie With Director krishna vamshi
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X