»   » సల్మాన్ గెలాక్సీలో ‘గణపతి బప్పా’సెలబ్రేషన్స్ లేవు

సల్మాన్ గెలాక్సీలో ‘గణపతి బప్పా’సెలబ్రేషన్స్ లేవు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ దాదాపు దశాబ్దం కాలంగా ప్రతి సంవత్సరం గణపతి పూజా కార్యక్రమాన్ని వారు నివాసం ఉంటున్న గెలాక్సీ అపార్టుమెంటులో నిర్వహిస్తున్నారు. సల్మాన్ చిన్న చెల్లెలు అర్పిత ఖాన్ ద్వారా ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని సల్మాన్ ఫ్యామిలీ ప్రతి సంవత్సరం కొనసాగిస్తున్నారు.

ప్రతి సంవత్సరం గణపతి పూజా కార్యక్రమాలతో సల్మాన్ ఖాన్ నివాసమైన గెలాక్సీ అపార్ట్‌మెంట్స్ సందడిగా ఉండేవి. అయితే ఈ సంవత్సరం మాత్రం గెలాక్సీ అపార్టుమెంటు వద్ద ఆ సందడి ఉండబోదని తెలుస్తోంది. ఆ అపార్టుమెంటుకు మరమ్మత్తులు, మార్పులు చేస్తుండటం వల్ల సల్మాన్ ఫ్యామిలీ మొత్తం ఆరు నెలల క్రితమే పాన్వెల్ ఫాంహౌస్‌కు షిప్టయ్యారు. ఈ నేపథ్యంలో ఈ సారి పాన్వెల్ ఫాంహౌస్‌లోనే 'గణపతి బప్పా' సెలబ్రేషన్స్ నిర్వహించనున్నట్లు బాలీవుడ్ మీడియా టాక్.

ప్రతి సంవత్సరం సల్మాన్ ఫ్యామిలీ గణపతి బప్పా విగ్రహాన్ని బంద్రాలోని బీచ్‌లో నిమజ్జనం చేసే వారు. కానీ ఈ సారి పాన్వెల్ ఫాంహౌస్ సమీపంలోనే నిమజ్జనం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సారి కూడా సల్మాన్ చెల్లెలు అర్పిత ఖాన్ పర్యావరణానికి హానికలిగించని ఎకో ఫ్రెండ్లీ గణపతి బప్పా విగ్రహాన్ని తయారు చేయిస్తుందట.

సల్మాన్ ఖాన్ గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లో గతంలో జరిగిన గణపతి బప్పా సెలబ్రేషన్స్ ఫోటోలు స్లైడ్ షోలో...

సల్మాన్ ఖాన్

సల్మాన్ ఖాన్


సల్మాన్ ఖాన్ కుటుంబం గత దశాబ్ద కాలంగా వారు నివాసం ఉంటున్న గెలాక్సీ అపార్టుమెంటులో గణపతి బప్పా వేడుకలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ కార్యక్రమాలను ఆయన చెల్లెలు అర్పిత ఖాన్ స్వయంగా చూసుకుంటారు.

గణపతి బప్పా

గణపతి బప్పా


గణపతి బప్పా సెలబ్రేషన్స్ సమయంలో సల్మాన్ నివాసం చాలా సందడిగా ఉంటుంది. వాళ్ల ఇంట్లో వాళ్లంతా గణపతికి పూజలు చేస్తూ గడుపుతుంటారు. వారంతా ఎంతో ఇష్టంగా ఈ వేడుకల్లో పాల్గొంటారు.

నిమజ్జన కార్యక్రమం

నిమజ్జన కార్యక్రమం


గతంలో గణేష్ నిమజ్జన కార్యక్రమంలో సల్మాన్ ఖాన్ పాల్గొన్న దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు. నిమజ్జనం సందర్భంగా సల్మాన్ ఖాన్ ఎంతో సందడిగా గడిపేవారు. నృత్యాలు చేసే వారు.

మేనల్లుడితో సల్మాన్

మేనల్లుడితో సల్మాన్


తన మేనల్లుడు అర్హాన్ ఖాన్‌తో కలిసి గణేష్ నిమజ్జనం సందర్భంగా నృత్యాలు చేస్తున్న బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ను ఇక్కడున్న దృశ్యంలో ఇక్కడ చూడొచ్చు. వినాయక చవితి సందర్భంగా వాళ్ల ఇంట్లో పండగ వాతావరణం నెలకొంటుంది.

వాంటెడ్ మూవీలో...

వాంటెడ్ మూవీలో...


గణపతి బప్పాను బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఎంతో సెంటిమెంటుగా భావిస్తున్నాడు. ఆయన సినిమాల్లో కూడా గణపతి బప్పా దర్శనం ఇస్తుంటాడు. వాంటెడ్ చిత్రంలోని ఓసీన్‌ను ఇక్కడున్న దృశ్యంలో చూడొచ్చు.

కుటుంబ సభ్యులతో కలిసి సల్మాన్

కుటుంబ సభ్యులతో కలిసి సల్మాన్


తన కుటుంబ సభ్యులతో కలిసి సల్మాన్ ఖాన్ గణపతి బప్పా పూజా కార్యక్రమంలో పాల్గొన్న దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు. గత దశాబ్ద కాలంగా సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ గణపతి బప్పా పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

English summary
It's been a decade now, ever since Bollywood superstar Salman Khan's family have been celebrating Ganpati puja every year at the residence. Reportedly, it is actually Salman's younger sister Arpita Khan, who takes all the initiative to arrange everything for the puja, and brings the Ganesh idol at their home in Galaxy Apartments. This has been practised by the Khan family for the last 11 years. But, as per the recent reports, there seems no room for Ganpati Bappa this year at Sallu's Galaxy Apartment, due to renovation.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu