Don't Miss!
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- News విశాఖ లోక్‌సభ పరిధిలో ఆ సామాజిక వర్గందే పెత్తనం..బొత్స ఝాన్సీకి కలిసొస్తుందా..?
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
తనదగ్గర ఏదీ దాచను, కన్నతల్లిని కాదని చెప్తాను: సన్నీ లియోన్
సన్నీ ఒకప్పుడు పోర్న్ స్టార్... అలా తాను ఒక శృంగార తారగా మారటానికి దారితీసిన పరిస్థితులను చెప్పుకొనీ, తనకున్న సమస్యలు తీరిపోయాక బాలీవుడ్ లోకి వచ్చి ఇప్పుడు ఆ పాత జీవితానికి స్వస్తి చెప్పేసింది కూడా. ఇప్పుడు బాలీవుడ్ లో ఆమె చేస్తున్నవి కొంత శృంగార పాత్రలే అయినా కొత్తగా సన్నీ వల్ల బాలీవుడ్ చెడి పోయిందేమీ లేదు...
మల్లికా శరావత్, రాఖీ సావంత్
ఆమెకంటే ముందే మల్లికా శరావత్, రాఖీ సావంత్ లాంటి నటీమణులు బాలీవుడ్ ని సుభిక్షంగానే ఉంచారు. కానీ సన్నీ ని మాత్రం ఆ పాత గతం వెంటాడుతూనే ఉంది. అదీ ఎంతగా అంటే ఇప్పుడామె మంచి పనే చేసినా కూడా ఆమెను జనం మాత్రం ఒక పోర్న్ స్టార్ గానే చూస్తున్నారు...
సన్నీ లియోన్
సన్నీ లియోన్ అనగానే ఆమెను ఒకే యాంగిల్లో చూస్తుంటాం. శృంగార తారగా ఆమె వేసిన ముద్ర అలాంటిది మరి. పోర్న్ సినిమాలు వదిలేసి.. బాలీవుడ్‌లోకి వచ్చినప్పటికీ ఇక్కడ కూడా గ్లామర్ టచ్ ఉన్న పాత్రలే చేస్తూ అదే తరహా ఇమేజ్‌తో సాగిపోతోంది సన్నీ.
ఓ చిన్న పాప
ఐతే సన్నీ చేసే సేవా కార్యక్రమాల గురించి జనాలకు తెలిసింది తక్కువే. ఆమె ఛారిటీ కోసం చాలా పెద్ద మొత్తంలోనే ఖర్చు పెడుతూ ఉంటుంది. అంతే కాక.. ఓ చిన్న పాపను దత్తత తీసుకుని ఆమె బాగోగులు చూస్తోంది సన్నీ.
కొంచెం తెలివి రాగానే
ఆ బిడ్డను తాను కనకపోయినప్పటికీ.. తనను సొంత తల్లిలాగే చూసుకుంటానని ఆమె అంది. ఐతే ఈ అమ్మాయికి కొంచెం తెలివి రాగానే తన తల్లిని తాను కాదని చెబుతానని సన్నీ చెప్పడం విశేషం.
ఏమీ దాచాలని అనుకోవట్లేదు
ఓ ఇంటర్వ్యూలో ఈ పాప గురించి సన్నీ మాట్లాడుతూ.. షసాధారణంగా దత్తత తీసుకున్న పిల్లలకు ఇలాంటి విషయాలు చెప్పకూడదు. కానీ నా కూతురి దగ్గర అలా ఏమీ దాచాలని అనుకోవట్లేదు. అందుకే నిషా అసలు తల్లిని నేను కాదని.. ఆమెకు ఊహ తెలియగానే చెబుతాను.
కన్న బిడ్డ కంటే ఎక్కువగా
దత్తత తీసుకున్నట్లు మా వద్ద ఉన్న పత్రాలు కూడా చూపిస్తాను. ఎందుకంటే కన్న తల్లి తనను వదిలేసిందని తను బాధపడకూడదు. తొమ్మిది నెలలు మోసి కనకపోయినా.. కన్న బిడ్డ కంటే ఎక్కువగా నిషాను చూసుకుంటాను. తనకు మంచి జీవితాన్నివ్వాలని.. తనను మంచి స్థాయికి తీసుకెళ్లాలని అనుకుంటున్నాను" అని సన్నీ వివరించింది.