పవన్‌ కళ్యాణ్‌తో విభేదాలపై హరీష్ శంకర్ స్పందన..!

By Bojja Kumar

హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ హీరోగా రూపొందిన 'గబ్బర్ సింగ్' చిత్రానికి దర్శకత్వం వహించిన హరీష్ శంకర్ ఆ సినిమాతో టాప్ దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. దీంతో 'గబ్బర్ సింగ్' సీక్వెల్‌కు కూడా ఆయనే దర్శకత్వం వహిస్తారని అంతా అనుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా ఈ చిత్రానికి సంపత్ నందిని దర్శకుడిగా ఎంపిక చేసాడు పవన్ కళ్యాణ్.

దీంతో పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ మధ్య అభిప్రాయ విబేధాలు ఉండటం వల్లనే అతన్ని పక్కకి తప్పించారనే పుకారు షికారు చేసింది ఫిల్మ్ నగర్లో. దీనిపై తాజాగా ఓ ఆంగ్లపత్రికతో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు హరీష్ శంకర్. 'ఆ సినిమాకు దర్శకత్వం వహించినంత మాత్రాన సీక్వెల్‌కి కూడా నేనే దర్శకత్వం వహిస్తానని అనుకోవడం సరికాదు. దర్శకత్వం చేయనంత మాత్రాన ఆయనతో నాకు అభిప్రాయ బేధాలు ఉన్నాయని అనుకోవడం సబబు కాదు. నేను ఎంతో కాలంగా పవన్ కళ్యాణ్‌తో మంచి రిలేషన్ షిప్ కలిగి ఉన్నాను' అని వివరణ ఇచ్చారు.

'గబ్బర్ సింగ్' సీక్వెల్‌కి సంపత్ నందిని ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో పవన్ కళ్యాణ్ చెప్పారు. 'గబ్బర్ సింగ్'కు ఓనర్ పవన్ కళ్యాణ్. ఆ సినిమా విషయంలో ఆయన నాతో పాటు ఎవరికీ వివరణ ఇచ్చుకోవాల్సిన పని లేదు. కానీ నాకు ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారో వెల్లడించారు. దీన్ని నాకు దక్కిన గౌరవంగా భావిస్తాను... అని హరీష్ శంకర్ వెల్లడించారు.

పవన్ కళ్యాణ్‌తో త్వరలో సొంతంగా తయారు చేసుకున్న కథతో సినిమా చేస్తాను. రొమాంటిక్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా దాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఆగస్టు నెల తర్వాతనే ఆ సినిమా గురించి నేను పూర్తి వివరాలు వెల్లడించగలను అని హరీష్ శంకర్ చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X