సినీ రంగానికి సేవా పన్ను మినహాయింపు
సినిమా రంగంపై సేవా పన్ను(సెర్వీస్ టాక్స్) విధించాలనే కేంద్ర ప్రభుత్వం ఆలోచనకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆయా సినీ పరిశ్రమలు నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. ఆ మధ్య దేశ వ్యాప్తంగా సినిమా బంద్‌కు కూడా పిలుపునిచ్చారు. దేశంలోని సినిమా పరిశ్రమ మొత్తం ఏకమైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా మెట్టు దిగింది.
కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో సినీ రంగంపై సేవా పన్ను మినహాయించడంతో పాటు, సినీమాటోగ్రఫీ కాపీ రైట్స్ పై కూడా సేవా పన్ను మినహాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై పలువురు నిర్మాతలు, సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.
ఇప్పటికే నష్టాల్లో సాగుతున్న సినిమా రంగంపై పన్ను విధించడం సరికాదని, తమ కష్టాలను అర్థం చేసుకుని కేంద్ర ప్రభుత్వం పన్ను మినహాయిస్తూ నిర్ణయం తీసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











