ఆమె నుంచి సెక్స్ ఆశిస్తున్న నిర్మాతలు!
సినిమా అవకాశం కావాలా..? అయితే మాతో సెక్స్‌లో పాల్గొనాలి!.....ఇది ఫోర్న్ స్టార్ సన్నీలియోన్ ముందు కొందరు బాలీవుడ్ నిర్మాతలు పెడుతున్న ప్రతిపాదన. వినడానికి కాస్త కటువుగా ఉన్న ఇది నిజమేనని అంటున్నారు. సీని పరిశ్రమలో ఇలాంటి చీకటి కోణాలు చాలా ఉన్నాయి. కొందరు హీరోయిన్లను దర్శకులు, నిర్మాతలు డాష్ డాష్ చేసిన సంఘటనలు అనేకం ఉన్నాయి. చాలా మంది తారలు ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటించారు కూడా.
ఇలాంటి నేపథ్యంలో.... ఫోర్న్ స్టార్ సన్నీలియోన్‌కు ఇలాంటి పరిస్థితులు ఎదురవ్వడం ఆశ్చర్య పడాల్సిన విషయమేమీ కాదు. అయితే సన్నీలియోన్ మాత్రం వారి ఆఫర్లను నిర్మొహమాటంగా తిరస్కరిస్తోందట. తన టాలెంట్‌పైనే ఆమె పూర్తి నమ్మకం పెట్టుకుందట. బిగ్ బాస్ 5లో మంచి పెర్పార్మెన్స్ ఇవ్వడం వల్లనే ఆమెకు జిస్మ్ 2 చిత్రంలో అవకాశం లభించింది.
ప్రస్తుతం ఆమె జిస్మ్ 2 చిత్రంతో పాటు...పెటా సంస్థ తరుపున ప్రచారం చేసే అవకాశంతో పాటు, మ్యాన్ ఫోర్స్ కండోమ్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. వీటితో పాటు ఫోర్న్ చిత్రాల్లోనూ నటిస్తోంది. శృంగార సంబంధమైన ఉత్పత్తులు చేసే చాలా సంస్థలు ఆమెను తమ కంపెనీ ప్రచార కర్తగా నియమించుకుంటున్నాయి.
'తమతో సెక్స్ చేస్తేనే సినిమా అవకాశాలు ఇస్తామని ముందుకొస్తున్న చెత్త నిర్మాతలు.....ఆమె ఫోర్న్ స్టారే కానీ, వ్యభిచారి కాదనే విషయం అర్థం చేసుకోవాలి' అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.


Click it and Unblock the Notifications











