వర్మ పెద్ద పంచ్ ఇచ్చాడు: నాగార్జునకి రొమాన్స్ లేదట, మళ్ళీ గగనమే అంటున్నారు

Recommended Video

వర్మ పెద్ద పంచ్ ఇచ్చాడు.. నాగార్జునకి రొమాన్స్ లేదట !

రామ్‌గోపాల్ వర్మ, మన్మథుడు నాగార్జున కాంబినేషన్ అంటే ఎంత క్రేజ్ వుంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శివ సినిమాతో టాలీవుడ్ లో ట్రెండ్ సెట్ చేసిన ఈ కాంబినేషన్ 28 ఏళ్ల తర్వాత మళ్లీ చేతులు కలిపారు. ఈ ఇద్దరూ గతంలో మాదిరిగానే మళ్లీ టాలీవుడ్ రికార్డులను తిరగరాసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సెన్షేషనల్ కాంబోలో ఇన్నేళ్లకు మళ్లీ ఓ మూవీ తెరకెక్కబోతోంది అన్న వార్త రాగానే ఇండస్ట్రీ మొత్తం అటుపక్క ఆసక్తిగా చూపు తిప్పింది. ఇప్పుడు ఆ సినిమా గురించి తెలిసే ప్రతీ చిన్న విషయమూ ఇంట్రస్టింగే...

వర్మ సినిమా

వర్మ సినిమా

సినిమాకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. మామూలుగా వర్మ సినిమాలో ఎక్కువ శాతం ఫైట్స్‌తో పాటు అక్కడక్కడ కాస్త రొమాన్స్ జోడించడం అలవాటు. అయితే నాగార్జున, వర్మ కాంబినేషన్‌లో సినిమాలో అక్కినేని అభిమానులు, వర్మ అభిమానులు అనుకున్నట్లుగా ఉండదట.

"గగనం" తరహాలో

సినిమా మొత్తం గతంలో ఒక ప్రయోగంగా వచ్చిన "గగనం" తరహాలో ఉంటుందనే చర్చ జరుగుతుంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో రొమాన్స్‌, కామెడీ, పాటలకు నో ఛాన్స్‌. కేవలం యాక్షన్‌ ప్రధానంగా ఈ చిత్రం ఉంటుందని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

హీరో తప్ప మిగతా పాత్రలు

హీరో తప్ప మిగతా పాత్రలు

ఈ సినిమాలో రొమాన్స్ అనే మాట మాట్లాడటానికి వీల్లేదు. అంతేకాదు పాటలు అస్సలు లేవట. ఒక వేళ పాటలు ఉన్నా బ్యాక్ గ్రౌండ్ లో వినిపించే ఒకటి రెండు తప్ప అంతకు మించి ఉండవట. అంటే ఈ సినిమాలో హీరో , మిగతా పాత్రలు తప్ప హీరోయిన్ ఉండదనుకుంటే తప్పులో కాలేసినట్లే.

హీరోయిన్ పేరు

హీరోయిన్ పేరు

టాలీవుడ్‌‌లో పేరుగాంచిన సీనియర్ హీరోయిన్ ని బుక్ చేయటానికి ప్రయత్నిస్తూన్నారు... . అయితే ఆ హీరోయిన్ పేరు మాత్రం ఇంత వరకూ ఎక్కడా బయటికి రాలేదు. యూనిట్ కూడా కావాలనే ఆ పేరుని బయట పెట్టటం లేదు...

గ్లామర్ ఒలకబోయటానికి కాదు

గ్లామర్ ఒలకబోయటానికి కాదు

సినిమాలో హీరోయిన్ కేవలం గ్లామర్ ఒలకబోయటానికి పరిమితం కాకుండా యాక్షన్ లోనూ ఆమె పాత్ర ఉంటుందనీ,అసలు ప్రేమ అన్న మాటకూడా ఇద్దరి మద్ధ్యా రాదనీ ఇప్పటికి ఉన్న టాక్. హీరోయిన్‌‌కు సంబంధించి షూట్ మొత్తం జనవరి లేదా ఫిబ్రవరిలో జరుగుతుందని టాక్.

హైదరాబాద్‌‌లో షూటింగ్

హైదరాబాద్‌‌లో షూటింగ్

ప్రస్తుతం హీరోయిన్‌‌, హీరోలకు కావాల్సిన కాస్టూమ్స్‌‌ సెలెక్ట్ చేసే పనిలో నిమగ్నమయ్యాడట వర్మ. హైదరాబాద్‌‌లో షూటింగ్ జరుగుతోంది. డిసెంబర్‌‌లో చిత్రబృందం మొత్తం ముంబైలో వెళ్లనుంది. అక్కడ సుమారు నెల రోజుల పాటు షూటింగ్ జరగనుందని సమాచారం.

 మన్మథుడు

మన్మథుడు

మొత్తానికి చూస్తే నాగార్జున సినిమా అంటే కాసింత రొమాన్స్ ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో మాత్రం రొమాన్స్ అనే మాట వినపడదని తెలుసుకున్న అభిమానులు కాస్త అసంతృప్తికి లోనయ్యారట.

 వర్మపై నమ్మకంతో

వర్మపై నమ్మకంతో

కాని వర్మపై నమ్మకంతో నాగార్జున ఈ చిత్రాన్ని చేస్తున్నాడు. కలెక్షన్స్‌ రాకున్నా కూడా పేరు అయినా వస్తుందనే నమ్మకంతో నాగార్జున ఉన్నాడు. ఒక విభిన్న చిత్రం చేశాను అనే పేరు కోసం నాగార్జున ఈ చిత్రాన్ని చేస్తున్నాడు అంటూ కొందరు అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X