»   »  సూపర్ స్టార్ సినిమాకు ఇలాంటి పరిస్థితి ఏంటి.. భయం ఎందుకు!

సూపర్ స్టార్ సినిమాకు ఇలాంటి పరిస్థితి ఏంటి.. భయం ఎందుకు!

Subscribe to Filmibeat Telugu

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కాలా చిత్రం భారీ అంచనాల నడుమ జూన్ 7 న విడుదలకు సిద్ధం అవుతోంది. రజనీకాంత్ సినిమాకు దేశ వ్యాప్తంగా ఎలాంటి క్రేజ్ ఉంటుందో అందరికి తెలిసిందే. కబాలి చిత్ర దర్శకుడు పా రంజిత్ కాలా చిత్రానికి కూడా దర్శకుడు. మాఫియా బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.

రజనీకాంత్ చిత్రాలు తెలుగులో కూడా భారీ వసూళ్లని సాధిస్తాయి. రోబో, శివాజీ వంటి చిత్రాలతో ఈ విషయం నిరూపితమైంది. కాగా కాలా చిత్ర తెలుగు వర్షన్ హక్కుల విషయంలో చిక్కు వచ్చి పడ్డట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని కొనుక్కునేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదట. రజని చిత్రానికి ఇలాంటి పరిస్థితి ఎపుడూ లేదని సినీ వర్గాలు అంటున్నాయి.

 No takers for Rajinikanth’s Kaala movie

దీనికి కారణం కాలా చిత్ర తెలుగు హక్కుల కోసం అధిక ధర డిమాండ్ చేయడమే దీనికి కారణం అని అంటున్నారు. కబాలి చిత్ర తెలుగు హక్కులు భారీ మొత్తానికి అమ్ముడయ్యాయి. ఆ చిత్రానికి ఉన్న భారీ హైప్ వలన డిస్ట్రిబ్యూటర్స్ గట్టున పడ్డారు. కాలా చిత్రానికి కూడా అదేస్థాయిలో ధర డిమాండ్ చేస్తుండడంతో ఈ చిత్రాన్ని కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని సమాచారం. జూన్ 7 న సినిమా విడుదల కావలసి ఉంది. ఈ లోపు ఎవరైనా తెలుగు వర్షన్ హక్కులు దక్కించుకుంటారేమో చూడాలి.

English summary
No takers for Rajinikanth’s Kaala movie. Kaala will going to release on 7th June
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X