గోవా ఫిల్మ్ ఫెస్ట్‌లో...తెలుగు సినిమాకు దక్కని చోటు!
తెలుగు సినీ పరిశ్రమ నుంచి మొత్తం 9 ఎంట్రీలు వెళ్లగా అందులో కేవలం 4 సినిమాలను మాత్రమే సెంట్రల్ కమిటీ వరకు వెళ్లాయి. మొత్తం అన్నీ భాషల నుంచి 18 సినిమాలను ఎంపిక చేయగా, అందులో ఒక్క తెలుగు సినిమా కూడా స్థానం దక్కించుకోలేక పోయింది.
ఇలా అయితే ఎలా, మావూరి జోగిని, మల్లెల తీరం, మినుగురులు, ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, ఓంకారం, ప్రత్యామ్నాయం, వీరంగం చిత్రాలను ఎంట్రీకి పంపినా ఈ సినిమాల్లో కొత్తదనం, గోవా ఫిల్మ్ పెస్టివల్ లో ప్రదర్శించే అర్హత లేదనే నెపంతో కమిటీ ఈ సినిమాలను తోసి పుచ్చింది.
గత సంవత్సరం పరిస్థితి పరిశీలిస్తే...శ్రీకాంత్ హీరోగా నీలకంఠ దర్శకత్వంలో వచ్చిన'విరోధి' చిత్రం మాత్రమే గోవా ఫిల్మ్ ఫెస్ట్ లో స్థానం దక్కించుకుంది. ఈ సారి కనీసం ఒక్క సినిమా కూడా ఫెస్ట్ లో చోటు దక్కించుకోలేక పోవడం శోచనీయం. మరి మన తెలుగు సినిమాల్లో అంత సత్తా లేదా...కమిటీ మన తెలుగు సినిమాల పట్ల నిర్లక్ష్యం వహించిందా? తేలాల్సి ఉంది.


Click it and Unblock the Notifications












