’బెజవాడ’ కష్టాలపై...నాగార్జున రిక్వెస్ట్!

By Bojja Kumar

బెజవాడలో..బెజవాడ సినిమాకు చాలా పెద్ద కష్టమే వచ్చి పడింది. ఇంతకీ ఆ దుస్థితి ఏమిటంటే....ఈ సినిమాకు విజయవాడలో అసలు థియేటర్లే దొరకడం లేదు. దొరకడం లేదనడం కంటే ఈ సినిమాను ప్రదర్శించడానికి థియేటర్ల యజమానులు ఇష్ట పడటం లేదు అనడం కరెక్ట్. మామూలుగా ఈ రేంజ్ సినిమా బెజవాడ, పరిసర ప్రాంతాలు కలిపి కనీసం 40 థియేటర్లలో విడుదల కావాలి. కానీ కేవలం నాలుగు థియేటర్లు మాత్రమే దొరికాయి.

బెజవాడ సినిమా రూపొందుతున్నప్పటి నుంచే కాంట్రవర్సీలకు కేంద్రంగా మారింది. ఈ సినిమా బెజవాడలో గతంలో జరిగిన ముఠా తగాదాల నేపథ్యంలో రూపొందించారని, బద్దశత్రువులైన దేవినేని, వంగవీటి వర్గీయుల ప్రస్తావన ఈ సినిమాలో ఉందని మొదటి నుంచీ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ప్రదర్శిస్తే ఏమైనా గొడవలు జరిగితే థియేటర్లను నష్టపోతాం అని వాటి యజమానులు భయ పడుతున్నారు.

చివరకు నాగార్జున ఫోన్ చేసిన మరీ థియేటర్ల యజమానులను రిక్వెస్ట్ చేసే వరకు పరిస్థితి వెళ్లిందంటే.....అక్కడి సీన్ అర్థం చేసుకోవచ్చు. రేపు ఈ సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. మరి ఏం జరుగబోతోందో? వెయిట్ అండ్ సీ....

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X