పెళ్ళి ప్లాన్స్ పై నోరు విప్పిన జెనిలియా
జెనీలియా త్వరలో తన బోయ్ ప్రెండ్ రితీష్ దేశముఖ్ ని వివాహం చేసుకోబోతోందంటూ ముంబై పత్రికల్లో వార్తలు వస్తున్న నేపధ్యంలో ఆమె నోరు విప్పింది. ఆమె మాట్లాడుతూ..ప్రస్తుతం నా చేతిలో ఆరు సినిమాలు ఉన్నాయి. ఊపరి రతీసుకోవటానికి కూడా టైమ్ లేదు. ఇంక నేను ఇలాంటి సమయంలో పెళ్లి,పిల్లలు అని ఎలా అడగగలుతున్నారు అంది. అలాగే జీవితంలో పెళ్ళి,పిల్లలే కాకుండా విలువైనవి, ప్రాముఖ్యమైనవి చాలా ఉన్నాయని తేల్చి చెప్పింది. ఇక ప్రస్తుతం తన దృష్టి అంతా ఘర్షణ రీమేక్ ఫోర్స్ మీద ఉందని అంది. అలాగే తను నటించిన ఉరిమి సినిమాకు మంచి ప్రశంసలు వచ్చాయని మురసిపోతోంది. సంతోష్ శివన్ వంటి గొప్ప దర్శకుడుతో పనిచేయటం తన అదృష్టం అంది.
మరో ప్రక్క ఆమె హీరోయిన్ గా 'నా ఇష్టం" టైటిల్ తో రూపొందే చిత్రంలో చేస్తోంది. రానా హీరోగా చేస్తున్న ఈ చిత్రం ఓ రొమాంటిక్ కామిడీగా రూపొందుతోంది. ప్రకాష్ తోలేటిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, సక్సస్ ఫుల్ యువనిర్మాత పరుచూరికిరీటి నిర్మిస్తున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ చిత్రం 'నా ఇష్టం'. జెనీలియాకు కూడా ప్రస్తుతం ఈ సినిమా హిట్టవటం చాలా అవసరం. ఆరెంజ్ తర్వాత ఆమెకు తెలుగులో పూర్తి క్రేజ్ తగ్గిపోయింది. అందులోనూ నాగబాబుకి ఆమెకు మధ్య జరిగిన గొడవ కూడా ఆమెను ఇండస్ట్రీకి దూరంగా పెట్టేసాయి.


Click it and Unblock the Notifications











