twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాట్ స్టార్ తాప్సీ కి ఇప్పుడు కొత్త బాధ పట్టుకుంది

    By Srikanya
    |

    "నా మొదటి సినిమాయే రాఘవేంద్రరావు వంటి గొప్ప డైరెక్టర్‌తో చెయ్యడం నిజంగా నా అదృష్టం. ఆయన తో పనచేసిన అనుభవం నాకు తర్వాత ఎంతగానో ఉపయోగపడుతోంది అంటోంది తాప్సీ. అలాగే రాఘవేంద్రరావు గారు.. హీరోయిన్స్ ని చాలా అందంగా చూపిస్తారు. అలాగే ఝుమ్మందినాదం షూటింగ్ లో ఓ సీన్ చేశాక కొత్తదానివైనా బాగా చేశావని మెచ్చుకున్నారు. అప్పుడు ఎంత సంతోషమేసిందో అని గుర్తు చేసుకుంది. ఝుమ్మందినాదం చిత్రంతో పరిచయమైన తాప్సీ ఇంకా ఆ చిత్రం నాటి సంగతులనే తలచుకుని మురిసిపోతోంది. అయితే ఇప్పుడు తనకు కొత్త బాధపట్టుకుందని, తొలి సినిమా చేసేప్పుడు తీరిక దొరికేది కానీ ఇప్పుడు అది దొరకడం లేదని బాధపడుతోంది. షూటింగ్ మధ్య ఓ రెండ్రోజులు గ్యాప్‌వస్తే ఢిల్లీలోని మా ఇంటికెళ్లి నా కుటుంబంతో గడుపుతున్నా. మామూలుగా ఎక్కువ టైమ్ దొరికితే సినిమాలు చూస్తూ, మ్యూజిక్ వింటుంటా అని చెప్పింది. తాప్సీ డిల్లీలోని ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కూతురు.ప్రస్తుతం ప్రభాస్ సరసన 'మిస్టర్ పర్ఫెక్ట్', 'వీరా'లో రవితేజకి జోడీగా నటిస్తోంది. అలాగే తాప్సీ కి ఇప్పుడు తమిళ సూపర్ స్టార్ గా వెలుగుతున్న సూర్య సరసన ఆఫర్ వచ్చిందని సమాచారం. కేవీ.ఆనంద్ దర్శకత్వం లో రూపొందే ఈ చిత్రం టైటిల్ మాట్రాన్.

    English summary
    If an offers slips away from your hand, then it will be your mistake says the white beauty Delhi glam doll Tapsi Panu who has shakes the Tollywood with her photogenic face in the movie Jhummandi Naadam. Tapsi is currently busy working for a couple of movies with Prabhas and Ravi Teja.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X