టైటిల్ లేకుండా సినిమా..నేనంతే అదో టైపు: మెగాస్టార్..!
'నేనంతే అదో టైపు. సినిమాకి టైటిలెందుకు? సినిమాకి ఇంటెర్వెల్ వుండలా? లాంటి విషయాలే ఆలోచిస్తా. చాలామంది నన్ను పిచ్చోడనుకుంటారు. కానీ నా ఆలోచన నాకుంటుంది" ఈ మాటలంటోన్నదెవరో కాదు, వెరైటీ చిత్రాల దర్శకుడు, కన్నడ మెగా స్టార్ హీరో ఉపేంద్ర. 'నిజమే, నేను వెరైటీ సినిమాల కోసం ఆలోచిస్తాను. నన్నునేనెలా చూసుకోవాలనుకుంటానో, అలానే నా సినిమాల్లో హీరో వుంటాడు. దర్శకత్వంపై అవగాహన వుండడమే కాదు, అన్ని విభాగాలపైనా అవగాహన వుండడం నా అదృష్టం. అదే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది.
ప్రేక్షకులకు నచ్చే సినిమా తీయడం కాదు. ఏ సినిమా తీసినా ప్రేక్షకుల్ని మెప్పించగలిగేనా వుండాలి. ఇదే నా సిద్దాంతం.."అంటోన్న ఉపేంద్ర, పేరు లేని టైటిల్ తో ఈ మధ్యనే ఓ ప్రయోగం చేశాడు కూడా. ఆ సినిమానే ఇప్పుడు తెలుగులో విడుదల చేస్తోన్న ఉపేంద్ర, త్వరలోనే డైరెక్ట్ తెలుగు సినిమా ఒకటి చేయబోతున్నాననీ, అదీ తన దర్శకత్వంలోనే వస్తుందని చెప్పాడు. తెలుగు సినిమా స్థాయి చాలా పెరిగిందనీ, 'మగధీర" సినిమా బాగా నచ్చిందనీ, అలాంటి సినిమా చేయడానికి గట్స్ కావాలని అన్నాడు ఉపేంద్ర.


Click it and Unblock the Notifications











